అదృష్టం అంటే ఇదే..జాక్ పాట్ కొట్టేశారు.. రూ.5,214 కోట్ల లాటరీ సొంతం చేసుకున్నారు!

మన దేశంలో లాటరీల ద్వారా డబ్బులు రావడం అనేవి తక్కువ కానీ.విదేశాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి.

 Rs 5215 Crore Lottery California Resident, Powerball Lottery Usa Results, Powerb-TeluguStop.com

రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి.

వారి బిజినెస్ కు సంబంధించి ప్రమోషన్ల కోసం ఇలాంటివి పెడుతుంటారు.అలాంటి లాటరీ మళ్లీ కాలిఫోర్నియా వాసికి తగిలింది.

దాదాపు 70 కోట్ల డాలర్ల జాక్ పాట్ అంటే దాదాపు మన కరెన్సీలో రూ.5,215 కోట్లు. కాలిఫోర్నియాలోని మొర్రో బే ప్రాంతంలోని ఒక సరకు దుకాణంలో పనిచేసే వ్యక్తికి (ఆడ లేదా మగ) దక్కింది.లాటరీ గెలుచుకున్న వాళ్ల పేరును మాత్రం వాళ్లు చెప్పలేదు.

ఆ లాటరీని క్లయిమ్ చేసుకోవడానికి ఇంకా ఎవరూ రాలేదని చెప్పారు.ఆ లాటరీ పేరు పవర్‌బాల్‌ లాటరీ.

దీని కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు.ఆ టికెట్ కాకుండా మిగతా వారికి కూడా చిన్నపాటి నగదు అంటే రూ.28 లక్షల వరకు బహుమతులను పొందారు.అంతే కాకుండా మరో నలుగురు దాదాపు రూ.300 నుంచి మొదలుకొని రూ.7.45 కోట్ల వరకు సొమ్మును పొందనున్నట్లు పేర్కొన్నారు.

70 కోట్ల డాలర్ లాటరీ పొందిన వారికి ట్యాక్స్ సొమ్ముపోను మిగతావి ఇవ్వనున్నట్లు తెలిపారు.ఒకేసారి తీసుకుంటే దాదాపు రూ.3696 కోట్లను అందిస్తామని.విడతల వారీగా తీసుకుంటే మాత్రం ఏడాదికి పెద్ద మొత్తం సొమ్మును ముట్టుజెబుతామన్నారు.ఇలా దాదాపు 29 సంవత్సరాల పాటు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.పై రెండు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా ట్యాక్స్ పోను ఎంత వస్తే అంత అమౌంట్ ను ఇస్తామని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube