సమంత మరో కీర్తీ రెడ్డి కాబోతుందా.. చైతుతో విడాకుల తర్వాత సినిమాలకు గుడ్ బై?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ పెళ్లిళ్ల విషయంలో బాగా నిర్లక్ష్యం చేస్తుంటారు.కొన్ని కొన్ని సార్లు మంచి జీవితాలనే పాడు చేసుకుంటారు.

 Samantha Become Another Keerthi Reddy Say Good Bye To Movies After Divorce, Sam-TeluguStop.com

ఇప్పటికే కొంతమంది నటీనటులు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని జీవితాలను పాడు చేసుకున్నారు.అంతే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు కోల్పోయారు.

ఇదిలా ఉంటే సమంత పరిస్థితి కూడా త్వరలో ఏం జరగనుందో ఎవరికి అర్థం కావట్లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత గురించి తన నటన గురించి అందరికీ తెలిసిందే.

ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఏ మాయ చేసావే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఆ సినిమాలో నటించిన అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అక్కినేని కోడలిగా అడుగు పెట్టిన తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది.

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకుపోయింది.

అలా ఓవైపు పెళ్లి జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న సమంత.గత కొన్ని రోజుల నుండి తన భర్త నాగచైతన్యతో విడిపోతుందని బాగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

గతంలో తన సోషల్ మీడియాలో తన పేరు తర్వాత అక్కినేని పేరు తొలగించినప్పటి నుంచి అనుమానాలు మొదలయ్యాయి.

Telugu Akkineni, Divorce, Keerthyreddy, Kirthi Reddy, Naga Chaitanya, Samantha,

ఆ తర్వాత కొన్ని రోజులకు సమంత నాగచైతన్యను విడిపోతుందని టాలీవుడ్ లో బాగా టాక్ వినిపించింది.ఇటీవలే ఒంటరిగా కొన్ని ప్రయాణాలు కూడా చేస్తుందని తెలిసింది.దీంతో సమంత పరిస్థితి కూడా కీర్తి రెడ్డిలా కాబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

గత కొన్ని సంవత్సరాల కిందట తెలుగు ఇండస్ట్రీలో కీర్తి రెడ్డి, సుమంత్ లా పరిస్థితి కూడా ఇలాగే మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు, అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ తనతో కలిసి నటించిన స్టార్ హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రెండు సంవత్సరాలకే విడిపోయారు.అలా సుమంత్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోగా.

కీర్తి రెడ్డి మాత్రం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

Telugu Akkineni, Divorce, Keerthyreddy, Kirthi Reddy, Naga Chaitanya, Samantha,

కానీ కీర్తి రెడ్డి మళ్లీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు.పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్ గా నిలిచిన కీర్తి రెడ్డి పెళ్లి తర్వాత అవకాశాలు వచ్చినా కూడా వదులుకుంది.ఆ తర్వాత సుమంత్ నుండి దూరం అయ్యాక.

ఇండస్ట్రీలో వారి బ్రేకప్ ల గురించి బాగా ప్రశ్నలు ఎదురవడంతో అవన్నీ తట్టుకోలేక ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పేసింది.దీంతో సమంత కూడా అక్కినేని వారసుడినే పెళ్లి చేసుకోగా వీరి పెళ్లి కూడా కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుంది.

ఇక సమంత కూడా నాగచైతన్యను విడిచి పెట్టే పరిస్థితి వస్తుందేమో అని ఒకవేళ నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత స్టార్ హోదాలో ఉన్న సమంత కూడా ఇండస్ట్రీలో చైతుతో విడిపోయిన ప్రశ్నలు తట్టుకోలేక నిమాలను వదిలేసే అవకాశం వస్తుందేమో అని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube