బాలయ్య, నాగ్ నటించాల్సిన ఆ రెండు సినిమాలు ఎందుకు ఆగిపోయాయంటే?

గడిచిన పది సంవత్సరాలలో తెలుగులో పదుల సంఖ్యలో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి.మల్టీస్టారర్ సినిమాలకు సాధారణ సినిమాలతో పోలిస్తే బడ్జెట్ కొంచెం ఎక్కువైనా బిజినెస్ మాత్రం భారీ స్థాయిలో జరుగుతోంది.

 Why Did Those Two Films Stopped Nagarjuna And Balakrishna Had To Do, Balakrishan-TeluguStop.com

అయితే బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అటు అక్కినేని అభిమానులతో పాటు ఇటు నందమూరి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.అటు నాగార్జున, ఇటు బాలకృష్ణ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

బాలకృష్ణ నాగార్జున కాంబినేషన్ లో సినిమా రాకపోయినా బాలకృష్ణ నాగేశ్వరరావు కాంబినేషన్ లో శ్రీరామరాజ్యం సినిమాతో పాటు గాండీవం, భార్యాభర్తల అనుబంధం సినిమాలు వచ్చాయి.మరోవైపు హరికృష్ణ , నాగార్జున కలిసి సీతారామరాజు సినిమాలో నటించగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

అయితే బాలయ్య, నాగ్ కాంబినేషన్ లో గుండమ్మ కథ రీమేక్ రానుందని గతంలో వార్తలు వచ్చాయి.

Telugu Balakrishna, Gundamma Katha, Nagarjuna, Nagashwarao, Seetha Ramaraju, Sur

సూర్యకాంతం పాత్రలో నటించి ఆమె స్థాయిలో మెప్పించే నటి దొరకకపోవడంతో గుండమ్మ కథ రీమేక్ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.ఆ తరువాత ప్రముఖ నిర్మాతలలో ఒకరైన బెల్లంకొండ సురేష్ బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేశారు.మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాను బాలయ్య, నాగ్ కాంబినేషన్ లో నిర్మించాలని బెల్లంకొండ సురేష్ భావించారు.

Telugu Balakrishna, Gundamma Katha, Nagarjuna, Nagashwarao, Seetha Ramaraju, Sur

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా ఆగిపోయింది.ఆ విధంగా బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో రావాల్సిన రెండు సినిమాలు ఆగిపోగా రాబోయే రోజుల్లో సైతం ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు.అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రాకపోయినా తారక్, నాగచైతన్య కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube