చేసింది తక్కువ సినిమాలే అయినా తన పాత్రల ద్వారా రష్మిక మందన్నా ప్రేక్షకులకు చేరువయ్యారు.పక్కింటి అమ్మాయి తరహా పాత్రలను ఎక్కువగా ఎంపిక చేసుకునే రష్మిక కన్నడ సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టి టాలీవుడ్ లో ఆఫర్లను అందిపుచ్చుకున్నారు.
తెలుగులో విజయాలను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక ఆ తర్వాత బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయ్యారు.
బాలీవుడ్ లో రష్మికకు అవకాశాలు బాగానే వస్తున్నా తెలుగుకు సైతం ఈ బ్యూటీ ప్రాధాన్యత ఇస్తున్నారు.
పారితోషికం కంటే మంచి పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తున్న రష్మిక ఎన్టీఆర్, ప్రభాస్, పవన్, చరణ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఆయా హీరోలకు జోడీగా నటించడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే రష్మిక చీరలో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రష్మిక చీరలో మరింత అందంగా కనిపిస్తుండగా చీర ధర తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.
రష్మిక ధరించిన ఈ చీర ఖరీదు ఏకంగా 48,000 రూపాయలు.
ప్రముఖ డిజైనర్లలో ఒకరైన అశ్విని రెడ్డి ఈ చీరను డిజైన్ చేశారు.రష్మిక మెడలో వేసుకున్న బంగారు హారం ధర 2,86,300 రూపాయలు కాగా వేలికి ధరించిన ఉంగరం ఖరీదు 97,000 రూపాయలు కావడం గమనార్హం.త్యానీ బై కరణ్ జోహార్ జ్యూయెలరీ నుంచి రష్మిక ఈ ఆభరణాలను కొనుగోలు చేశారు.రష్మిక తన షాపింగ్ గురించి చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను షాప్ కు వెళితే ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఏది సెలెక్ట్ చేసుకోకూడదో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అవుతానని ఆ రీజన్ వల్ల తాను ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ నే ఇష్టపడతానని రష్మిక చెప్పుకొచ్చారు.రష్మిక నటిస్తున్న పుష్ప డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కానుందని తెలుస్తోంది.