తండ్రికి తగ్గ నటుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో టాప్ హీరో స్టేటస్ ను అందుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ ఏకంగా 1,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
ప్రభాస్ తర్వాత దాదాపు అదే స్థాయిలో మార్కెట్ ఉన్న హీరోగా రామ్ చరణ్ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.చరణ్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం.
ఒకవైపు రామ్ చరణ్ కమర్షియల్ సినిమాలలో నటిస్తూనే ఆ సినిమాలలో కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా బడ్జెట్ ఏకంగా 500 కోట్ల రూపాయలు కాగా సంక్రాంతి లేదా సమ్మర్ లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కానున్న నేపథ్యంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు చిరంజీవి లీడ్ రోల్ లో, చరణ్ కీలక పాత్రలో ఆచార్య మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ట్రిపుల్ ఆర్ సినిమాలా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా గందరగోళం నెలకొంది.దీపావళి లేదా సంక్రాంతికి ఆచార్య రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలుగా ఉంది.

వెయ్యి కోట్ల బడ్జెట్ హీరోగా మారిన రామ్ చరణ్ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తారో చూడాల్సి ఉంది.చరణ్ గతంలో తుఫాన్ అనే సినిమాతో బాలీవుడ్ లో సత్తా చాటాలనే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది.మరి ఈసారైనా బాలీవుడ్ లో చరణ్ సక్సెస్ అవుతాడేమో చూడాల్సి ఉంది.