ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య జనవరి 20న అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.తనదైన నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు.
పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి దేశాన్ని వణికిస్తున్న కరోనాపై పోరుకు దిగిన బైడెన్.పకడ్బందీ చర్యలతో అమెరికాను వైరస్ గండం నుంచి గట్టెక్కించగలిగారు.
వ్యాక్సినేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టి జూలై 4న స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు కరోనా విముక్తి దినం పేరిట ఉత్సవాలను సైతం జరిపించారు.ఇక ట్రంప్ కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ అమెరికన్లకు ఆశాదీపంలా మారారు.
అలాంటి వ్యక్తి ఒకే ఒక్క నిర్ణయంతో తన ప్రతిష్టను దిగజార్చుకున్నారు.
ఆఫ్గనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం ఏర్పడటానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
అమెరికా-నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాడంటూ ఆఫ్గన్ ప్రభుత్వం-ప్రజలు సైతం బైడెన్‌పై దుమ్మెత్తి పోశారు.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇదే సమయంలో ఆయన పట్ల అమెరికన్ల ఆలోచనల్లోనూ మార్పు కనిపిస్తోంది.దీని ఫలితంగానే బైడెన్ పాపులారిటీ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది.
తాజాగా అమెరికాకు చెందిన ఎమర్షన్ కాలేజీ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పటికిప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిపితే జో బైడెన్ పరాజయం పాలవుతారని.
డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని సర్వే అభిప్రాయపడింది.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకున్న కారణంగా జో బైడెన్ ఇంటా బయటా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు.
స్థానిక అమెరికన్లతో పాటు అంతర్జాతీయ సమాజం సైతం బైడెన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.ఎమర్షన్ కాలేజీ నిర్వహించిన సర్వేలో ఆఫ్ఘన్‌పై అమెరికా వైఖరికి సంబంధించి దాదాపు 47 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటేస్తే.
ఒక శాతం తక్కువగా బైడెన్‌కు 46 శాతం మంది అండగా నిలిచారు.ఇక 2024 లో అధ్యక్ష పదవికి బైడెన్, ట్రంప్‌లలో ఎవరిని ఎన్నుకుంటారని అని సర్వేలో ప్రశ్నించారు.ఇందులో 60 శాతం మంది డెమోక్రాట్లు 2024 లో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటే.67 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ను తమ అభ్యర్థిగా పేర్కొంటున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఎవరు ఎక్కువ బాధ్యత వహించాలి? అన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా.ట్రంప్‌కు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది.49 శాతం మంది మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ బాధ్యత వహించాలని చెప్పగా.24 శాతం మంది బైడెన్, 18 శాతం మంది బరాక్ ఒబామా వైపు నిలిచారు.మొత్తం మీద ప్రజాదరణకు సంబంధించి ఏప్రిల్‌లో 53 శాతంతో వున్న జో బైడెన్ ఆగస్ట్ నాటికి 49 శాతానికి పడిపోయారు.
మరోవైపు ఈ ఏడాది నవంబర్‌లో యూఎస్ ప్రతినిధుల సభ, సెనేట్ స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరుగనున్నాయి.ఈ ఎన్నికలపై ఆఫ్ఘన్ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.