ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంతాయి అని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.2019 టిడిపి, జనసేన విడివిడిగా ఎన్నికలకు వెళ్లడంతో ఘోరంగా దెబ్బతిన్నాయి.కానీ 2014 ఎన్నికల సమయంలో జనసేన సహకారంతో టిడిపి ఏపీలో అధికారంలోకి వచ్చింది.అయితే మళ్లీ అదే రకమైన పొత్తు పెట్టుకుంటేనే విజయం సాధించగలమనే అభిప్రాయం రెండు పార్టీల నేతలలోనూ ఉంది.
అయితే పొత్తు పెట్టుకునేందుకు సరైన అవకాశం ఏర్పడకపోవడంతో ఎవరికి వారు ఈ విషయంలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.అయితే చంద్రబాబు విషయంలో పవన్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటారు.
గత టీడీపీ ప్రభుత్వం లోనూ పవన్ పెద్దగా విమర్శలు చేసింది లేదు.ఇక పవన్ విషయంలోనూ చంద్రబాబు అదే వైఖరితో ఉంటూ వస్తున్నారు.
బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎంతగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నా, ఆ పార్టీ నుంచి స్పందన లేకపోవడంతో మరింత దూరం పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.ఈ సమయంలో జనసేన పార్టీ తో కలిస్తేనే 2024 లో అధికారం దక్కుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.
దీని కోసం అవసరమైతే జనసేన కు భారీ స్థాయిలోనే సీట్లను కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.ఈ విధమైన సంకేతాలను జనసేన కు పంపించారు.అయితే టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన కొన్ని కండిషన్లు పెట్టే ఆలోచనలో ఉందట.జనసేన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఉండడంతో పాటు, ఏపీలో నెలకొన్న సమస్యలను హైలెట్ చేస్తోంది.
అయినా ఒంటరిగా అధికారంలోకి రావడం అంతా అషామాషీ వ్యవహారం కాదు అనే విషయం గుర్తించే, టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

కాకపోతే ఈ విషయం లో కొన్ని కండిషన్లు విధించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.2024 ఎన్నికల్లో జనసేన, టిడిపి కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తే, చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రిగా ఉండాలని, లోకేష్ ను దూరం పెట్టాలనే షరతు విధించాలని చూస్తున్నారట.2024 లో చంద్రబాబు పరిపాలన కొనసాగినా, 2029 నాటికి పూర్తిగా జనసేన బలోపేతం చేసి సొంతంగా అధికారంలోకి రావాలని, అప్పటికి టిడిపి ప్రజాదరణ కోల్పోతుంది కాబట్టి జనసేన వైసీపీ మధ్య మాత్రమే పోటీ ఉంటుంది అనేది పవన్ అభిప్రాయం.లోకేష్ ను ఇప్పుడు ప్రోత్సహించినా రాబోయే రోజుల్లో అది తమకు ఇబ్బందికరంగా మారుతుంది అనే ఆలోచనతోనే జనసేన , టిడిపి పొత్తు విషయంలో లోకేష్ వ్యవహారాన్ని తప్పకుండా ప్రస్తావించాలనే అభిప్రాయంతో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.