తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్..!!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు( monsoon assembly meetings ) ఈరోజు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది.ఆగస్టు మూడవ తేదీ నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ( Telangana Governament ) నిర్ణయం తీసుకుంది.

 Telangana Assembly Meetings Date Fixed , Monsoon Assembly Meetings, Telangana As-TeluguStop.com

ఈ సమావేశాలు ప్రారంభమైన తర్వాతనే ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించుకోవాలనేది వారు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu Assembly, Congress, Fix, Telangana-Politics

అయితే దీనికోసం ఆగస్టు 3వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించుకోవాలని అంతేకాకుండా, జూలై 31వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించుకోవాలని ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాలకు ( Assembly meeting ) ముందు ఈ సమావేశం అనేది చాలా ఆసక్తికరంగా మారింది.అయితే దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర మంత్రివర్గం చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో రాబోవు కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉండగా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఆగస్టు అసెంబ్లీ సమావేశాల తర్వాత సెప్టెంబర్ లోని ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికోసం ప్రభుత్వం అనేక కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Assembly, Congress, Fix, Telangana-Politics

అయితే ఇవే తెలంగాణ రాష్ట్రానికి చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకునేందుకు పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.అంతేకాకుండా ఈ సమావేశాల్లో ప్రతిపక్షం కూడా గట్టిగానే గళం విప్పేటట్టు కనిపిస్తోంది.ఎందుకంటే రాష్ట్రమంతా వరదల ప్రభావంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు.దీన్నే ప్రధాన అంశంగా చేసుకొని ప్రతిపక్షాలు రాష్ట్ర సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లడమే కాకుండా అనేక రోడ్లు దెబ్బతిన్నాయి.

ఎంతోమంది ప్రజల ఇండ్లు కూలిపోయాయి.ఈ తరుణంలో ప్రతిపక్షాలు వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube