వైరల్: నడివీధులలోకి ప్రవేశించిన మృగరాజ.. చివరికి...?

జంతువులు కొన్ని మనకు మేలు చేస్తాయి.ఇంకొన్ని మనకి హాని చేస్తాయి.

 Viral: The Beast King Who Entered The Streets Finally A Lion , Pet, House ,phn-TeluguStop.com

అందుకే చాలా వాటిని మనుషులు పెంచుకోరు.సాధు జంతువులనే పెంచుకుంటూ ఉంటారు.

అడవిలో ఉండే జంతువులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటారు.తాజాగా ఓ జంతువు ప్రజల మధ్యకు వచ్చింది.

దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.ఇంతకీ ఆ జంతువు ఏంటంటే సింహం.

మనుషులను తినే స్వభావం ఉన్న సింహాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది.ఎక్కడ అది మనల్ని చంపేస్తుందిరా బాబూ అనుకుంటూ పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకుంటాం.

మరి అదే సంఘటన కాంబోడియాలో చోటుచేసుకుంది.ప్రస్తుతం దానికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక చైనీస్ వ్యక్తి సింహాన్ని పెంచుకోవాలని అనుకున్నాడు.అలా ఆయన పెంచుకుంటున్న సింహమే రోడ్డు మీద వచ్చి ప్రజలను హడలిపోయేలా చేసింది.

అక్కడున్న ప్రజలు సింహం యజమానిని తిట్టిపోశారు.ఇంట్లో పెంచుకుంటున్న జంతువును రోడ్డుమీదకు వదలడం సరైన పద్దతి కాదని ఫైర్ అవుతున్నారు.అటువంటి క్రూరమైన జంతువుని పెంచుకోవడం తప్పైతే దాన్ని ఇలా రోడ్డు మీదకు వదలడం ఇంకా పెద్ద తప్పని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కూడా ఈ సింహం ఇలా బయటకు రావడంతో వార్తల్లోకెక్కింది.

ఈ చైనీస్ బిజినెస్ మ్యాన్ తన సింహంతో అనేక టిక్ టాక్ వీడియోలు చేసేవాడు.అలా వీడియోలను పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.

Telugu Phnom Penh, Qi Xiao, Street, Pics, Wealthychinese-Latest News - Telugu

రెస్క్యూ టీమ్ ఆ సమయంలో అక్కడికి చేరుకుని సింహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఆ తర్వాత యజమాని తనకు న్యాయం చేయాలంటూ ఆ దేశ ప్రధానిని కోరాల్సి వచ్చింది.సింహాన్ని ఆ బిజినెస్ మ్యాన్ కే ఇప్పించేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.అయితే ఆ సింహాన్ని బయటకు తీసుకురాకుండా ఇంట్లోనే బోనులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.మళ్లీ ఈయన ఇలాంటి తప్పు చేయడం పట్ల స్థానికులు పెదవి విరుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube