టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై చర్చ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలు జరుగుతూనే ఉంటుంది.ఆయన గతంతో పోలిస్తే బాగా యాక్టివ్ కావడం, సభలు-సమావేశాలు, పర్యటనలు చేస్తూ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవుతూ ఉండడం, అలాగే గతంతో పోలిస్తే తన ప్రసంగాలనూ మెరుగు పరుచుకోవడం, చంద్రబాబు తర్వాత ఆ స్థాయి వ్యక్తిగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
దీంతో లోకేష్ రాజకీయం పై టిడిపి లో కాస్త సానుకూలత పెరిగింది.అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
లోకేష్ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ తమకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా అందరూ తరచుగా బాబుకు ఫిర్యాదు చేయడం, అక్కడ నుంచి రియాక్షన్ లేకపోవడంతో సైలెంట్ అయిపోవడం, మరికొంతమంది పార్టీకి దూరమవడం, ఇలా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దీంతో లోకేష్ వ్యవహారం అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది .ఇప్పుడు టిడిపి ప్రతిపక్షంలో ఉండడం, లోకేష్ తన పనితీరు మెరుగుపరుచుకున్నట్టుగా కనిపిస్తుండడంతో, టిడిపిలో అంతా సద్దుమణిగింది అనే అభిప్రాయం కలుగుతూ ఉండగానే, సీనియర్లు మాత్రం లోకేష్ తీరుపై తీవ్ర అసహనం అసంతృప్తితో ఉన్నారట.ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకులు లోకేష్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికి కారణం లోకేష్ యువ నాయకులతో ప్రత్యేకంగా టీమ్ ను ఏర్పాటు చేసుకుని వారితోనే ఎక్కువగా అన్ని విషయాలను చర్చిస్తూ, వారికి ప్రాధాన్యం ఇస్తూ ఉండడం సీనియర్ నాయకులకు ఏమాత్రం రుచించడం లేదట.

తమ రాజకీయ అనుభవం, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా, తమను ఏమాత్రం లెక్క చేయడం లేదని, కానీ చంద్రబాబు తమకు ఎప్పుడు తగిన గౌరవ మర్యాదలు ఇస్తూ, తాము చెప్పిన మాటలను శ్రద్ధగా వినే వారిని, లోకేష్ వద్ద తమకు ఆ స్థాయిలో గౌరవమర్యాదలు దక్కడం లేదనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.దీనికి తోడు చంద్రబాబు సైతం లోకేష్ తోనే ఏ విషయం పైన చర్చించాలని, రాబోయే రోజుల్లో ఆయన టిడిపి పగ్గాలు చేపడతారనే విధంగా వ్యవహరిస్తూ ఉండడం సీనియర్లకు మరింత మంట కలిగిస్తోందట.