కలెక్షన్స్ : మొత్తానికి ఈ కుర్ర హీరో బాక్సాఫీస్ వద్ద బాగానే రాబట్టాడుగా...

తెలుగులో ఇటీవలే నూతన దర్శకుడు శ్రీధర్ మరియు యంగ్ హీరో కిరణ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన “ఎస్.ఆర్ కల్యాణ మండపం” చిత్రం థియేటర్లలో ఈ నెల ఆరో తారీఖున విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

 Sr Kalyanamandapam Collections Is Near By To Break Even, Sr Kalyanamandapam, Sr-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించగా ప్రముఖ సీనియర్ నటుడు సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, తులసి శివమణి, తనికెళ్ల భరణి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే కరోనా వైరస్ కారణంగా చాలా గ్యాప్ తర్వాత సినిమా థియేటర్లు తెరచుకున్నాయి.

అయినప్పటికీ ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తారో, రారో అనే సందిగ్ధం తీవ్రంగా నెలకొంది.

కానీ ఎస్.ఆర్ కల్యాణ మండపం చిత్ర కలెక్షన్లు చూస్తే మాత్రం ఔరా అనాల్సిందే.కాగా ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే దాదాపుగా 1.51 కోట్ల రూపాయల షేర్ ని కలెక్ట్ చేసింది.దీనికి తోడు ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఏ మాత్రం పడిపోకుండా దూసుకుపోతుంది.

కాగా మూడు రోజుల అనంతరం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా 4 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.ఇక ఇతర దేశాలలో దాదాపుగా 45 లక్షల రూపాయలు వసూలు సాధించింది.

దీంతో బ్రేక్ ఈవెన్ కి కేవలం మరో 33 లక్షల రూపాయలు సాధించాల్సి ఉంది.ఏదేమైనప్పటికీ కరోనా వైరస్ పరిస్థితులను దాటుకొని ఈ సినిమాని విడుదల చేసినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులకు మంచి ఫలితాలు దక్కాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Break, Kiran, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా లాక్ డౌన్ తర్వాత సినిమా థియేటర్లు తెరుచుకోవడంతో మొదటగా సత్యదేవ్ హీరోగా నటించిన “తిమ్మరుసు” మరియు యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన “ఇష్క్” చిత్రాలను థియేటర్లలో విడుదల చేశారు.అయితే ఇందులో తిమ్మరుసు చిత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది.ఇక ఇష్క్ సినిమా అయితే విడుదలైన మొదటి రోజు కనీసం 20 లక్షల రూపాయల షేర్ ను కూడా రాబట్టలేకపోయినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube