వయసు పైబడే కొద్ది కంటి చూపు మందగించడం సర్వ సాధారణమైన విషయం.అయితే నేటి ఆధునిక కాలంలో చిన్న వయసు వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది.
కంప్యూటర్ల ముందు గంటలు తరబడి వర్క్ చేయడం, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, పోషకాల లోపం, మొబైల్ ఫోన్ స్క్రీన్‌ను ఎక్కువగా చూడటం, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల కంటి చూపు దెబ్బ తింటుంది.అయితే మందగించిన కంటి చూపును మెరుగుపరచడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
అలాంటి వాటిలో కివీ పండు జ్యూస్ ఒకటి.చూసేందుకు సపోటా పండు మాదిరిగా ఉండే కివీ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ ఇలా బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.అందుకే కివీ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అందులో ముఖ్యంగా కివీ పండుతో తయారు చేసిన జ్యూస్ తరచూ తీసుకుంటే.
బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.
రెగ్యులర్‌గా లేదా రెండు రోజులకు ఒక సారి కివీ పండు జ్యూస్‌ను తీసుకుంటే.
అందులో ఉండే విటమిన్ ఎ మరియు శక్తివంతంమైన యాంటీ ఆక్సిడెంట్లు కంటి టిష్యూలను, కణాలను ఆరోగ్యంగా మారుస్తాయి.దాంతో కంటి చూపు మెరుగుపడతుంది.

అలాగే కివీ పండు జ్యూస్ తీసుకోవడం వల్ల అధిక రక్త పోటు సమస్య పరార్ అవుతుంది.ఎముకలు దృఢంగా మారతాయి.జీర్ణ శక్తి పెరుగుతుంది.షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.ఇక వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారు.కివీ పండు జ్యూస్ తాగితే సూపర్ ఫాస్ట్‌గా బరువు తగ్గుతారు.
అయితే కివీ పండు జ్యూస్‌లో షుగర్‌ను ఎట్టిపరిస్థితుల్లో వేసుకోరాదు.షుగర్ వేసుకోకుండా తీసుకుంటేనే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.