ప్రస్థానం సినిమాతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ మెసేజ్ తో సినిమాలు తీయాలంటే అది ఇతని తర్వాతే అనుకునేలా చేసుకున్నాడు డైరక్టర్ దేవా కట్ట.ప్రస్థానం వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఇప్పటికి ఆ సినిమాను అభిమానించే వారు ఉన్నారు.
ఇక ఈమధ్యనే దేవా కట్ట డైరక్షన్ లో రిపబ్లిక్ సినిమా వచ్చింది.ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నటించాడు.
ఈ సినిమాలో కూడా దేవా కట్ట తను చెప్పదలచుకున్న పాయింట్.ఇవ్వాల్సిన సోషల్ మెసేజ్ స్ట్రాంగ్ గా ఇచ్చాడు.
,/br>
ఇక దేవా కట్ట లోని పెన్ పవర్ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతని డైరక్షన్ లో సినిమాకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఆ సినిమాలు పూర్తి చేశాక పవన్, దేవా కట్ట కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని తెలుస్తుంది.పవన్ లాంటి హీరోతో దేవా కట్ట సోషల్ మెసేజ్ మూవీ చేస్తే దాని ఇంప్యాక్ట్ మరో లెవల్ లో ఉంటుంది.
తప్పకుండా ఈ కాంబినేషన్ అద్భుతమైన సినిమా ఇస్తుందని చెప్పొచ్చు.దేవా కట్ట డైరక్షన్ లో పవన్ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.