అదేంటో గానీ ఈ మధ్య పెండ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక మామూలుగా జరిగే వివాహ వేడుకల్లో ఎన్నో రకాలుగా సరదా సీన్లు కనిపిస్తుంటాయి.
ఇక వాటిని మనం సామాజిక మాద్యమాల్లో చూస్తూ తెగ నవ్వుకుంటాం.నిజం చెప్పాలంటే అసలు సోషల్ మీడియాలో వివాహానికి సంబంధించిన వీడియోలె టాప్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.
ఇక ఇలాంటి ఫన్నీ వీడియోలను చూడటానికి ప్రజలు కూడా చాలా ఇష్టపడుతున్నారు.ఎందుకంటే ఆ ఫన్నీ వీడియోలను చూస్తే చాలా నవ్వొస్తుంది.
అయితే ఇందులో కొన్ని వీడియోలు చూస్తే భావోద్వేగం కలగకుండా ఉండదేమో అనిపిస్తుంది.అందులో చాలా వరకు ఎమోషనల్ సీన్లు మన కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తుంటాయి.కాగా మనం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న ఓ పెళ్లికి సంబంధించిన వీడియో గురించి తెలుసుకోబోతున్నాం.నిజానికి పెండ్లిలో జంటను అందంగా చూపించేంది మాత్రం ఫోటోగ్రాఫర్లు మాత్రమే అని చెప్పాలి.
ఇక ప్రతి వెడ్డింగ్ వేడుకలో ప్రతి సీన్ ను కూడా వీరు తమ కెమెరాల్లో రికార్డు చేసేందుకు చాలా ట్రై చేస్తుంటారు.కాగా ఇప్పటి వీడియోలో మాత్రం వీరికి చుక్కలు చూపించింది ఓ పెండ్లి కూతురు.
ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఫన్నీ వీడియోలో ఫోటోగ్రాఫ్ చేసిన పని చివరకు ఆయన కొంప ముంచుతుంది.ఎందుకంటే వధూవరుల ఫోటోషూట్ ను ఏకంగా ఓ కొలను మధ్యలో ప్లాన్ చేసి వెడ్డింగ్ ఫోటోలు దిగుతున్నారు వధూవరులు.ఇక వీరిని ఫోటోగ్రాఫర్ తన బృందంతో కలిసి వెనుకాల నిల్చుని అందంగా ఫోటోలు తీస్తుంటాడు.అయితే ఫొటోగ్రాఫర్ వధువు వరులకు ఎలా పోజు ఇవ్వాలో చూపించేందుకు రావడంతో ఇదే అదునుగా ఏకంగా వధువు పెండ్లి కొడుకును, ఫొటోగ్రాఫర్ ను నీళ్లలోకి తోసేస్తుంది.