ఈ మధ్య కాలంలో విఘ్నేష్ శివన్ నయనతార పెళ్లికి సంబంధించిన వార్తలు తరచూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే కొన్ని వారాల క్రితం విఘ్నేష్ శివన్ ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు.
అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన వల్ల నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.త్వరలోనే నయనతార పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నంబర్ 1 హీరోయిన్ గా తన సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.గతంలో నయనతార కొన్ని వివాదాల్లో చిక్కుకున్నా ఆ వివాదాలు నయనతార కెరీర్ పై మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.
గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో ఫెయిల్ అయిన నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉండటం గమనార్హం.నయన్ విఘ్నేష్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా విఘ్నేష్ నయనతార కొచ్చిన్ కు స్పెషల్ జెట్ లో వెళ్లారు.తండ్రి అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉండటంతో నయనతార కొచ్చిన్ కు వెళ్లినట్టు సమాచారం అందుతోంది.అయితే నయనతార తండ్రి కూతురి పెళ్లిని చూడాలని కోరుకుంటున్నారని సమాచారం.తండ్రి కోరికను తీర్చాలనే ఉద్దేశంతో నయనతార సైతం త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పినట్టు తెలుస్తోంది.

నయనతార పెళ్లికి సంబంధించిన వస్తున్న వార్తల పట్ల ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.నయనతార విఘ్నేష్ శివన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎక్కడ పెళ్లి చేసుకుంటారో చూడాల్సి ఉంది.మరోవైపు నయనతార చేతినిండా సినిమా ఆఫర్లు ఉండగా తెలుగు సినిమాలకు మాత్రం నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.నయనతార మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేస్తూ వస్తుండగా తండ్రి వల్ల త్వరలో నయన్ విఘ్నేష్ వివాహ వేడుక జరగనుండటం గమనార్హం.