అతి తక్కువ ధరలోనే జియో రీఛార్జ్‌ ప్లాన్స్‌!

దిగ్గజ రిలయన్స్‌ జియో తమ వినియోగదారులకు అతి తక్కువ ధరలోనే రీఛార్జ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఎప్పుడు సంచలన మార్పులతో ముందుకు వచ్చే జియో ఇతర సంస్థలకు గట్టి పోటీని ఇస్తూనే ఉంటుంది.

 Here Is The Jio Recharge Plans With Less Price, Jio Bumper Offer, Jio Offer, Rel-TeluguStop.com

తాజాగా తక్కువ ధరలో అందిస్తోన్న రీఛార్జ్‌ ప్లాన్స్‌ వివరాలు తెలుసుకుందాం.

రిలయన్స్‌ జియో కస్టమర్లకు కేవలం రూ.4 తోనే 1 జీబీ డేటా ప్లాన్‌ను అందిస్తోంది.దీని వ్యాలిడిటీ కూడా 56 రోజులు.

దీంతోపాటు ఉచిత కాలింగ్‌.ప్రతిరోజూ వంద ఎస్‌ఎంఎస్‌లు వాడుకునే అవకాశం ఉంటుంది.

జియో ముఖ్యమైన 5 రీఛార్జ్‌ ప్యాకేజీల వివరాలు.రూ.3,499 రీఛార్జ్‌ ప్లాన్‌.అతి పెద్ద ప్యాకేజీ ఏడాదికి వర్తిస్తుంది.

ప్రతిరోజూ 3 జీబీ డేటా లభిస్తుంది.దీంతోపాటు అపరిమిత కాల్స్‌తోపాటు వంద ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

అంటే మొత్తానికి 1095 జీబీ అందిస్తోంది.
రూ.2,399 ప్లాన్‌.ఈ రీఛార్జ్‌ ప్లాన్‌తో ప్రతిరోజు ఒక జీబీ డేటాకు రూ.3.02 పడుతుంది.ఇది కూడా ఏడాదికి వర్తించే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌.ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది.దీంతోపాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌.100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.అంటే ఏడాదికి 730 జీబీ అందిస్తోంది.

Telugu Jio Bumper, Jio Offers, Reliancejio-Latest News - Telugu

జియో రూ.599 రీఛార్జ్‌ ప్లాన్‌.ఈ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ 84 రోజులకు వర్తిస్తుంది.ప్రతిరోజూ అందించే డేటాకు రూ.3.50 మాత్రమే పడుతుంది.దీంతోపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా అందిస్తుంది.

అపరిమిత వాయిస్‌ కాల్స్‌.ప్రతిరూజూ 100 ఎస్‌ఎంఎస్‌ సౌకర్యం పొందవచ్చు.

ఈ ప్లాన్‌తో మొత్తంగా వినియోగదారులు 168 జీబీ డేటా పొందుతారు.
రూ.444 ప్లాన్‌.ఈ ప్లాన్‌ 56 రోజుల వ్యాలిడిటీ వస్తుంది.

ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది.దీంతోపాటు అపరిమిత కాల్స్‌.

వంద ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.ఈ ప్లాన్‌తో మొత్తంగా 112 జీబీ లభిస్తుంది.1 జీబీ డేటాకు కేవలం రూ.3.9 అందిస్తోంది.
రూ.999 ప్లాన్‌ఈ ప్లాన్‌ ద్వారా ప్రతిరోజూ 3 జీబీ డేటా లభిస్తుంది.దీంతోపాటు అపరిమిత కాల్స్‌తోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు సౌలభ్యం అందిస్తోంది.దీనికి 1 జీబీకి కేవలం రూ.3.9 మాత్రమే.ఇది 84 రోజుల పాటు వర్తిస్తు.

ఈ ప్లాన్‌ ద్వారా మొత్తంగా 252 జీబీ సబ్‌స్క్రైబర్‌లకు లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube