ఖాళీ స్టేడియాల్లోనే టోక్యో ఒలింపిక్స్..!

ప్రపంచ క్రీడా సంబరం ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి.టోక్యో ఒలింపిక్స్ ఈసారి ఖాళీ స్టేడియాల్లోనే జరుగనున్నాయి.

 Tokyo Olympics Without Audience Games Chief Announced,latest News-TeluguStop.com

టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ఈ విషయంలో యూటర్న్ తీసుకుంది.ముందు పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వాలని అనుకున్నారు.

నాలుగు రోజుల క్రితం కమిటీ ప్రకటనలో 10 వేల మందికి అనుమతి ఇస్తారని అన్నారు.కాని తాజా ప్రకటనలో ఖాళీ స్టేడియాల్లోనే ఈ క్రీడలు నిర్వహించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు.

ఈ మేరకు కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో తాజా ప్రకటన చేశారు.జూల 23 నుండి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

ఒలింపిక్స్ కు ప్రేక్షకులను అనుమతించేది లేదని అంతకుముందు ప్రకటించారు.

Telugu Announced, Audience, Games, Olym, Tokyo-General-Telugu

స్థానికుల విషయంలో కొంత సడలింపు ఇచ్చారు.50 శాతం మించకుండా గరిష్ఠంగా 10 వేల మందిని అనుమతించాలని అనుకున్నారు.కాని ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఖాళీ స్టేడియాల్లోనే ఒలింపిక్స్ నిర్వహించాలని అనుకుంటున్నారు.

సీకో ప్రకటనతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.జపాన్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంతో ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహణ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.

ఒలింపిక్స్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం చూస్తున్న ప్రేక్షకులకు ఇది కచ్చితంగా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.ఈసారి అందరు ఒలింపిక్స్ ను టీవీల్లో వీక్షించాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube