1.తిరుమల అంగప్రదక్షిణ టోకన్లు విడుదల

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకన్లు జూన్ 15 నుంచి కరెంట్ బుకింగ్ స్థానంలో ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
2.మూడోరోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు మూడో రోజు సీబీఐ అధికారులు ముందు విచారణకు హాజరయ్యారు.
3.5g వేలానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
దేశంలో 5g సేవలు అందుబాటులోకి లైన్ క్లియర్ అయింది టెలికాం సంస్థలకు 5g స్పెక్ట్రం వేలం నిర్వహించేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
4.జగిత్యాల మెడికల్ కాలేజీ కి అనుమతి

వచ్చే విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్ల తో ప్రారంభించబోయే జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ కి జాతీయ మెడికల్ కమిషన అనుమతి ఇచ్చింది.
5.భారత్ లో ఆత్మాహుతి బాంబు దాడుల వార్నింగ్
మహమ్మద్ ప్రవక్త పై మాజీ బిజెపి నేతలు నుపూర్ శర్మ నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల పై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది.ఈ మేరకు నూపూర్ శర్మను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థలు భారత్ లో ఆత్మాహుతి బాంబు దాడులకు దిగుతామని హెచ్చరికలు జారీ చేశాయి.
6.బైక్ ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్ మంత్రి
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కాట్ర పల్లెలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బైక్ ర్యాలీ నిర్వహించారు.
7.కెసిఆర్ కు కేంద్ర మంత్రి లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.చర్లపల్లి , నాగుల పల్లి రైల్వే స్టేషన్ దగ్గర అభివృద్ధి పనులకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
8.మూడో రోజు కాంగ్రెస్ నిరసన దీక్ష
మూడో రోజు కాంగ్రెస్ నిరసన దీక్ష కొనసాగుతోంది.రాహుల్ గాంధీని మూడోరోజు ఈడీ అధికారులు విచారణకు పిలవడం తో దీక్షను కాంగ్రెస్ శ్రేణులు కొనసాగిస్తున్నాయి.
9.కాలేశ్వరం ముంపు బాధితుల ఆందోళన
ఢిల్లీలోని జంతర్మంతర్లో కాళేశ్వరం ముంపు బాధితులు ఆందోళనకు దిగారు.
10.మాణిక్యం ఠాకూర్ వార్నింగ్

ఏఐసిసి కార్యాలయాన్ని కి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం పై కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పెళ్లి పోలీసులు ఎలా అవుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు.
11.హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం

హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది.
12.జేపీ నడ్డా ను కలిసిన సుజనా చౌదరి
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ను ఎంపీ సుజనా చౌదరి కలిశారు.ఏపీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సుజనా తెలిపారు.
13.ఉండవల్లి రైతులతో సీఆర్డిఏ చర్చలు
పెళ్లి మండలం కొండపల్లి లో కరకట్ట రోడ్డు విస్తరణ బాధిత రైతులతో సీఆర్డీఏ చర్చలు నిర్వహించింది.గజానికి పదివేలు చొప్పున రైతులు డిమాండ్ చేస్తుండగా, ఐదు వేలు ఇచ్చేందుకు సిద్ధం అని సీఆర్డిఏ అధికారులు తెలిపారు.
14.చంద్రగిరి లో విపక్షాల ఆందోళన
చంద్రగిరి నియోజకవర్గంలో విపక్షాలు ఆందోళనకు దిగాయి గతంలో పోలీసు శాఖకు కేటాయించిన స్థలాన్ని వైసీపీ ఆఫీస్ ఏర్పాటుకు ఇవ్వడం ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
15.అర్హులకు భీమా పరిహారం ఇవ్వాలి : తులసి రెడ్డి

పంటల బీమా పథకం కింద రాష్ట్రంలోని అనేక మంది రైతులకు పరిహారం అందక పోవడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు.
16.ఈడీ విచారణ పై వైసీపీ ఎంపీ స్పందన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ అధికారులు విచారించడం పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.’ కర్మ సిద్ధాంతం తో పాటు చేసిన పాపాలు అనుభవించాల్సిందే ” అంటూ ఆయన విమర్శించారు.
17.ఆత్మకూరు ఉప ఎన్నికకు పోస్టల్ బ్యాలెట్ సిద్ధం
ఆత్మకూరు ఉప ఎన్నికకు పోస్టల్ బ్యాలెట్ సిద్ధమైంది .ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇతర కేంద్ర బలగాల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
18.రాజ్యసభ చైర్మన్ ను కలిసిన విజయసాయిరెడ్డి
రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తో కామర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయ సాయి రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు.
19.దుప్పి పై వీధి కుక్కల దాడి
చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం పరిధిలో అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చిన దుప్పి పై వీధికుక్కలు దాడికి పాల్పడడంతో అది గాయాలపాలైంది.వెంటనే స్థానికులు స్పందించి దుప్పిని రక్షించారు.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,150
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,440
.