జాతి రత్నాలు సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా కు మంచి పేరు దక్కింది.ఆమె లోని కామెడీ యాంగిల్ ను దర్శకుడు అనుదీప్ చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు.
ఆమె కు మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ దక్కడంతో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉందని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఆమెకు ఇప్పటి వరకు సినిమా ఆఫర్లు రాలేదు.
ఎట్టకేలకు ఆమెకు రెండవ ఛాన్స్ దక్కింది.ఆమె ఎత్తు కారణంగా చాలా మంది యంగ్ హీరోలు ఆమెను పక్కన పెడుతున్నారు అంటూ టాక్ వచ్చింది.
ఎట్టకేలకు మంచు హీరో విష్ణు ఆమెకు ఢీ అండ్ ఢీ సినిమా లో అవకాశం ఇచ్చాడని సమాచారం అందుతోంది.శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో ఫరియా నటించబోతున్నట్లుగా అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.
ఫరియా జాతి రత్నాలు సినిమా లో కామెడీ పండించిన తీరు అమోఘం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.అందుకే ఆమెకు ఈ ఆఫర్ దక్కిందని అంటున్నారు.ఢీ సినిమా కు సీక్వెల్ గా ఢీ అండ్ ఢీ రూపొందుతున్న విషయం తెల్సిందే.ఢీ సినిమా లో విష్ణు మరియు జెనీలియా లు నటించారు.
సీక్వెల్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఇంతలో యూనిట్ సభ్యులు ఈమెను ఓకే చేశారనే వార్తలు వస్తున్నాయి.మరి ఈ విషయంలో నిజం ఎంత అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
కాని కరోనా కారణంగా నిలిచి పోయింది.మళ్లీ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అతి త్వరలోనే షురూ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఇక చిట్టికి ఈ సినిమా తో అయినా మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి.