ఏపీ హైకోర్ట్ గ్రూప్-1 పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో గ్రూప్-1 పరీక్షలు నాలుగు వారాల పాటు వాయిదా పడినాయి.
ఇకపోతే కొద్ది రోజుల క్రితం పలువురు అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీంతో ఏపీ హైకోర్టు ఏపీపీఎస్సీకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు కూదా జారీ చేసింది.
కాగా నిన్న మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అంశం పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వు చేసి ఈరోజు గ్రూప్-1 పరీక్షల పై 4 వారాల పాటు స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.ఇక కోర్టు తీర్పుతో జూన్ 17 నుంచి జరగ వలసిన గ్రూప్-1 మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా వాయిదా పడ్దాయి.
ఇకపోతే ఈ విషయంలో 4 వారాల తర్వాత ఇంటర్వ్యూలకు కొత్త తేదీలు వెల్లడైయ్యే అవకాశాలున్నట్లుగా సమాచారం.మరి గ్రూప్-1 అభ్యర్ధులు నిరాశ చెందకుండా ఒక నెలపాటు వేయిట్ చేయవలసి వస్తుంది.