అయ్య బాబోయ్: ఇంత పెద్ద అరుదైన కొబ్రాను చూసారా ఎప్పుడైనా..?!

హిమాచల్​ ప్రదేశ్​ సిర్​మోర్​ జిల్లా ఫాదీ గ్రామంలో శనివారం స్థానికులు భారీ కింగ్​ కోబ్రాను గుర్తించారు. శివాలిక్​​ పర్వతశ్రేణుల్లో భాగమైన ఈ గ్రామంలో కోబ్రాను మొదట ప్రవీణ్​ అనే వ్యక్తి గుర్తించినట్లు సమాచారం.

 Have You Ever Seen Such A Big Rare Cobra Huge Cobra Spotted, Viral Viral , Vira-TeluguStop.com

ఈ కోబ్రా పొడవు సుమారు 12 నుంచి 15 అడుగులు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇటీవల కాలంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద సర్పాన్ని తాము ఎప్పుడూ గుర్తించలేదన్నారు.

ఈ కింగ్​ కోబ్రాలు తూర్పు- పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్​, సుందర్​బన్స్​ సహా శివాలిక్ పర్వతశ్రేణుల్లో ఎక్కువగా కనిపిస్తాయని అధికారులు వెల్లడించారు.సాధారణంగా పాము క‌నిపిస్తే భ‌య‌ప‌డేవాళ్లు ఉంటారు.

కానీ ఇప్పుడు మీరు చూడ‌బోయే పామును మీరు ఫోన్‌లో చూసినా కూడా ఒక్క క్ష‌ణం గ‌గుర్పాటు క‌లుగుతుంది.అందుకు కార‌ణం దాని సైజ్.

ఇప్ప‌టివ‌ర‌కు అలాంటి పాము మీకు క‌నిపించి ఉండ‌దు.ప్ర‌స్తుతం ఈ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఇంట‌ర్నెట్‌లో తెగ వైర‌ల్ అవుతుంది.

హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం కిరినగర్ ప్రాంతంలో ఈ భారీ కోబ్రా తన కలుగులోంచి బయటకు వచ్చే దృశ్యం క‌నిపించ‌డంతో కొంద‌రు వీడియో తీశారు.అది కాస్తా ఇంట‌ర్నెట్‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది.

కాగా హిమాచల్ ప్రదేశ్‌లో అడ‌వుల్లో నివ‌శించే ప‌లు తెగ‌ల వ్య‌క్తులు తాము ఇప్ప‌టివ‌ర‌కు పొడవైన విషపూరిత పాము ఇదే అని చెబుతున్నారు.

ఫారెస్ట్ అధికారులు కూడా ఇంత‌వ‌ర‌కు ఇంత పొడవైన కోబ్రాను తమ ప్రాంతంలో చూడ‌లేదు అంటున్నారు.ఒకటిన్నర నిమిషాలు ఉన్న‌ ఈ వీడియోలో, పాము ప్రాకుతూ కొండ‌ల‌పైకి వెళ్తుంది.ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాద్య‌మాల్లో తెగ వైరల్ అవుతోంది.

నెటిజ‌న్లు షేర్లు, కామెంట్ల‌తో హెరెత్తిస్తున్నారు.ఇంత పెద్ద పాము ఇది వరకూ ఎప్పుడూ చూసి ఉండలేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ పాము ప్రమాదకరమైనదేనిని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube