సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్.ఈ బ్యూటీ గత ఏడాది పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.పెళ్లి తర్వాత కూడా నటిగా తన ప్రస్థానం కొనసాగిస్తుంది.ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ఆచార్యతో పాటు, కమల్ హసన్ ఇండియన్2లో కాజల్ నటిస్తుంది.ఇక రీసెంట్ గా హిందీలో ఉమా అనే లేడీ ఒరియాంటెడ్ మూవీకి ఒకే చెప్పినట్లు క్లారిటీ ఇచ్చింది.ఇక ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసి లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
ప్రస్తుతం తెలుగులో జయశంకర్ దర్శకత్వంలో సెకండ్ వెబ్ సిరీస్ చేయడానికి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు హిందీలో మరో ప్రాజెక్ట్ కోసం కాజల్ అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీలో అజయ్ దేవగన్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే ఈ మూవీ తెరకెక్కనుంది అని సమాచారం.అయితే తమిళంలో ఖైది మూవీలో ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉండవు.
హిందీలో మాత్రం అక్కడి నేటివిటీ, ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్లు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని జత చేస్తున్నట్లు తెలుస్తుంది.దీనిలో అజయ్ దేవగన్ కి జోడీగా కాజల్ అగర్వాల్ ని తీసుకోనున్నారు.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి నిర్మాతలు కాజల్ అగర్వాల్ ని సంప్రదించడం జరిగిందని, ఆమె కూడా ఒకే చెప్పెసిందని టాక్ వినిపిస్తుంది.అయితే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కమల్ హసన్ తో విక్రమ్ మూవీ చేస్తున్నాడు.దీని తర్వాత ఖైదీ హిందీ రీమేక్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని బిటౌన్ లో టాక్ వినిపిస్తుంది.