ఆ దేశ అధ్యక్షుడు పై చెంప దెబ్బ కొట్టిన ఆగంతకుడు.. దాంతో..?!

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌కు ఘోర పరాభావం ఎదురయ్యింది.కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో దేశం నలుమూలా పర్యటిస్తోన్న ఆయన మంగళవారం నుంచే భారీ సడలింపులు ప్రకటించారు.

 Unknown Person Slaps The France President Emmanuel Macron , Man, Slaps, French,-TeluguStop.com

‘ఈరోజు నుంచి జనజీవనం మళ్లీ దారిన పడబోతోంది’ అని ప్రెసిడెంట్ ట్వీట్ కూడా చేశారు.దేశంలోని రెస్టారెంట్లు, హోటళ్లు మళ్లీ తెరుచుకుంటోన్న శుభసందర్భాన ప్రజల్ని నేరుగా కలిసిన ఆయన చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.

దేశ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌ ఇవాళ ఆగ్నేయ ఫ్రాన్స్‌కు వెళ్లారు.అక్కడి డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను సందర్శించి, కొవిడ్ ప్రొటోకాల్స్ ను చెక్ చేసిన అనంతరం తిరిగి వెళ్లేందుకు కారు వద్దకు బయలుదేరారు.

అయితే, అప్పటికే అధ్యక్షుడిని చూసేందుకు అక్కడ జనం గుమ్మికూడటంతో మాక్రాన్ బారికేడ్ల దగ్గరికెళ్లి వారితో కరచానలాలుచేశారు.ఈ క్రమంలో ఓ యువకుడు అధ్యక్షుడికి షేక్ హ్యాడ్ ఇచ్చినట్లే ఇచ్చి చెంప పగలకొట్టాడు.

అనూహ్య సంఘటనతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు.

అధ్యక్షుడు మాక్రాన్ ను చెంపదెబ్బ కొట్టిన యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తినీ సెక్యూరిటీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

అరెస్టు సమయంలో ఆ యువకుడు మాక్రాన్ అతివాద ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాగా, చెంపదెబ్బ తర్వాత అధ్యక్షుడు మళ్లీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.దేశాధ్యక్షుడిపై యువకుడు చేయిచేసుకోవడాన్ని రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి.

ప్రజాస్వామ్యంలో చర్చకు, వాదనలకు మాత్రమే చోటుంటుందని, దాడులకు కాదని ఫ్రాన్స్ ప్రధాని జేన్ కాస్టెక్స్ జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు.ఫ్రాన్స్ అధ్యక్షుడిని యువకుడు చెంపదెబ్బ కొట్టిన వీడియో నెట్టింట వైరలైంది.మితిమీరిన జాతీయవాదం, ముస్లిం వ్యతిరేకత, నియంత పోకడలను ప్రదర్శిస్తున్నారని మాక్రాన్ పై ఆరోపణలున్నాయి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube