జియోటీవీ అంటే తెలియని వారుండరు.చాలామంది దీన్నే ఎక్కువగా వాడుతుంటారు.
నెట్ స్పీడ్గా ఉంటుందని, వీడియోలు క్లారిటీగా ఉంటాయని చాలామంది దీన్నివాడుతుంటారు.అయితే ఇప్పటి వరకు దీన్ని మొబైల్ ఫోన్లలో మాత్రమే చూసేవాల్లు.
కానీ దీన్ని ల్యాప్‌టాప్, లేదా టీవీకి ఎలా కనెక్షన్ ఇచ్చుకుని వాటిల్లో చూడాలో చాలామందికి తెలియదు.అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
జియో యూజర్లకు లైవ్ టీవీ చూడటం కోసం రిలయన్స్ జియో టీవీ యాప్‌ను తీసుకొచ్చిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే ఈ యాప్ కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉంది.
కానీ చిన్న టెక్నిక్ ద్వారా జియో టీవీని ల్యాప్‌టాప్‌లో చూడొచ్చండి.దానికి కొన్ని ప్రాసెస్‌లు ఫాలో కావాలి.
మొదట మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో బ్లూ స్టాక్స్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.ఇది ఉంటేనే జియో టీవీని వీటిల్లో చూడొచ్చు.ఇలా ఇన్ స్టాల్ చేశాక గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి జియో టీవీ యాప్‌ను కూడా ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.బ్లూస్టాక్స్ హోం స్క్రీన్‌పై జియో టీవీ యాప్ కనిపిస్తుంది మీకు.
అప్పుడు ఇలా చేయండి.
అచ్చంగా మొబైల్ ఫోన్‌లో ఓపెన్ చేసినట్లే జియో టీవీ యాప్‌ను ఆపరేటింగ్ చేసుకోవచ్చు.
ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా జియో టీవీ యాప్‌లోని మీ ఫెవరేట్ మూవీస్, షోలను ఎంచక్కా ల్యాప్‌టాప్, పీసీలో చూడొచ్చు.ఇలా చేస్తే మీకు ఎంతసేపు మొబైల్ చూడాలంటే బోర్ కొడితే దీనివల్ల టైమ్‌పాస్ అవుతుంది.
పైగా బిగ్ స్క్రీన్‌లో మనకు నచ్చిన వీడియోలు చూడటం చాలా ఎంజాయ్ మెంట్‌గా ఉంటుంది కదా.ఇంకెందుకు ఆలస్యం మరి మీరూ ట్రై చేయండి.
అయితే ఇది ట్రై చేసేందుకు ఖచ్చితమైన మెజర్‌మెంట్స్ ఫాలో కావాలి.ఫోన్‌లో ఉన్న బ్లూ స్టాక్స్ హోం స్క్రీన్‌ను ల్యాప్‌ట్యాప్ లేదా టీవీకి షేర్ చేస్తే సరిపోతుంది.