ఎన్టీఆర్.తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎంత చెప్పినా తక్కువే.
ఎన్నో వందల సినిమాల్లో నటించి ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఏ పాత్ర చేసిన ఆయా పాత్రల్లో లీనమై నటించడం ఎన్టీఆర్ సొంతం అని చెప్పుకోవచ్చు.
అంతేకాదు.పౌరాణిక, జానపద, సాంఘిక ఒకటేమిటీ అన్నిరకాల సినిమాల్లో నటించి మెప్పించిన తోపు నటుడు ఎన్టీఆర్.ఆయన నటించిన సినిమాల్లో పలు సినిమాలు వసూళ్ల పరంగా రికార్డులు కొల్లకొట్టాయి.1977లోనే కోట్ల రూపాయలు సాధించిన సినిమా సైతం ఉంది.ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అడవిరాముడు.ఎన్టీఆర్ జీవితంలో మర్చిపోలేని సినిమా.1977 ఏప్రిల్ 28న విడుదలైంది.ఈ సినిమా సంచన విజయం సాధించడమే కాదు.తెలుగు సినిమా పరిశ్రమలో అప్పటి వరకు ఉన్న రికార్డులను కొల్లగొట్టింది.32 సెంటర్లలో 100 రోజులు ఆడి అదరహో అనిపించింది.తెలుగులో మూడు కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిన మొట్ట మొదట చిత్రంగా అవిరాముడు నిలిచింది.
ఈ సినిమా అనంతరం తెలుగులో కొత్త కాంబినేషన్లు మొదలయ్యాయి.
ఎన్టీఆర్‌తో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు అడవి రాముడు ఫస్ట్ మూవీ.ఈ సినిమా తర్వాత ఆయన మరో 11 సినిమాలు చేశారు.అటు జయప్రద, ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం.అప్పటి వరకు పౌరాణిక పాత్రలు ఎక్కువగా చేశాడు ఎన్టీఆర్.
కానీ ఈ సినిమాతో ఎన్టీఆర్ లోని కమర్షియల్ కోణాన్ని అవిష్కరించాడు దర్వకుడు రాఘవేంద్ర రావు.ఎన్టీఆర్ నటన, డైలాగులు, డ్యాన్సులు కమర్షియల్ కు అనుగుణంగా తీర్చి దిద్దాడు.ఎన్టీఆర్ నటనలోనూ కొద్ద మెరుగులు దిద్దేలా చేశాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఇంచుమించు బాలీవుడ్ టాప్ హీరో అమితాబ్ బచ్చన్ ను పోలి ఉండటం విశేషం.మొత్తంగా ఎన్టీఆర్ నట జీవితంలో ఈ సినిమా మర్చిపోలేని మధురం అనుభూతిని కలిగించింది.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఓ వేదిక మీద వెల్లడించాడు.