సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి కథల విషయంలో జడ్జిమెంట్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే.సినిమా కథ విన్న సమయంలోనే ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అంచనా వేయగల టాలెంట్ చిరంజీవి సొంతం.
ఆయన వారసుడైన రామ్ చరణ్ సైతం ప్రేక్షకులు మెచ్చే, తనకు నప్పే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ స్టార్ హీరోగా చిరంజీవి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
చిరుత సినిమా నుంచి వినయ విధేయ రామ్ సినిమా వరకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలు చాలా తక్కువగా ఉండటం గమనార్హం.
చరణ్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి.ప్రస్తుతం పాన్ ఇండియా కథలను వింటూ ఆ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథలలో నటించినా సక్సెస్ ను మాత్రం సొంతం చేసుకునే వారు కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాలలో ఎటో వెళ్లిపోయింది సినిమా ఒకటి.మ్యూజిక్ పరంగా ఈ సినిమా హిట్టైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడంలో మాత్రం ఈ మూవీ ఫెయిల్ కావడం గమనార్హం.నాని, సమంత ఈ సినిమాలో హీరోహీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే.రామ్ చరణ్ ఫేవరెట్ డైరెక్టర్లలో ఒకరైన మణిరత్నం ఓకే బంగారం కథను చరణ్ కు చెప్పారు.
కథ నచ్చినా తనకు సూట్ కాదని భావించి చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
యూత్ కు ఓకే బంగారం సినిమా నచ్చినా మిగిలిన వాళ్లను మాత్రం ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న మేర్లపాక్ గాంధీ కృష్ణార్జున యుద్ధం స్క్రిప్ట్ ను తయారు చేయగా ఈ సినిమా కథ చరణ్ కు నచ్చలేదు.చరణ్ రిజెక్ట్ చేసిన ఈ కథ నాని దగ్గరకు చేరగా చివరకు ఫ్లాప్ గా నిలిచింది.
రవితేజ హీరోగా నటించిన నేల టికెట్ కథ సైతం రామ్ చరణ్ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథ కావడం గమనార్హం.