మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా లో కీలక పాత్రను రామ్ చరణ్ చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రెండు వారాలు మినహా మొత్తం పూర్తి అయ్యింది.
కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఉండకుంటే గత వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది.షూటింగ్ కు అంతరాయం కలగడంతో పాటు సినిమా విడుదలకు కూడా కరోనా సెకండ్ వేవ్ అడ్డు వచ్చింది.
షూటింగ్ నిలిచి పోయినా సినిమా వాయిదా పడ్డా కూడా సినిమా గురించిన అంచనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.
మళ్లీ మళ్లీ ఈ సినిమా గురించిన వార్తలు వస్తునే ఉన్నాయి.తాజాగా మరో వార్త ఈ సినిమా గురించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అది సినిమా పై అంచనాలను పెంచేస్తుంది.
ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎప్పుడు వస్తుంది.
చిరంజీవితో చరణ్ పాత్ర కాంబో సన్నివేశాలు ఎంత సమయం ఉంటాయి అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కీలక సమాచారం చిత్ర యూనిట్ సభ్యుల నుండి వచ్చింది.వారు చెబుతున్నదాని ప్రకారం సినిమా ఇంటర్వెల్ సన్నివేశంలో చరణ్ వస్తాడు.
ఆ సమయంలో కీలక సన్నివేశం ఉంటుంది.ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో చిరంజీవితో చాలా సన్నివేశాల్లో కనిపిస్తాడు.
చిరంజీవితో స్క్రీన్ షేర్ టైమ్ దాదాపుగా 20 నిమిషాలు ఉంటుందని… మొత్తంగా చరణ్ స్క్రీన్ పై కనిపించేది 40 నిమిషాలు అంటూ వారు చెబుతున్నారు.ఈ 40 నిమిషాల స్క్రీన్ టైమ్ లో రెండు పాటల్లో చరణ్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా రామ్ చరణ్ మరియు చిరంజీవిలు కలిసి నటించబోతున్న ఈ సినిమా అద్బుతంగా ఉంటుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆచార్య కోసం ఎదురు చూస్తున్నారు.
కొరటాల శివ ఇప్పటి వరకు అపజయం ఎరుగడు.కనుక ఈ సినిమా తో ఆయన మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు.