తన ఆస్తులపై స్పందించిన ఆర్జీవీ.. ఎన్ని కోట్లంటే..?

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా సందర్భాల్లో ఇతరులు అడిగే ప్రశ్నలకు ఇష్టానుసారం సమాధానాలు చెబుతారనే సంగతి తెలిసిందే.దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న వర్మ తాజాగా ఆస్తుల గురించి ప్రశ్నలు ఎదురు కాగా ఆ ప్రశ్నలకు స్పందిస్తూ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

 Rgv Once Aain Giving Shocking Answer On His Assets,latest Interview,viral-TeluguStop.com

ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను తెరకెక్కించే వర్మ శివ సినిమాతో తన పేరు మారుమ్రోగేలా చేసుకున్నారు.

Telugu Assets, Ott-Movie

ఈ మధ్య కాలంలో వర్మ తీసిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టులేదనే సంగతి తెలిసిందే.అయితే యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వర్మ మాత్రం తెగ ఆసక్తి చూపిస్తుంటారు.వర్మ పలు సందర్భాల్లో యాంకర్లపై కూడా ప్రశంసలు కురిపిస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

తన ఆస్తుల గురించి తాను చెప్పనని వర్మ అన్నారు.తన ఆస్తికి వారసులు లేరని తాను చనిపోతే ఆస్తిని కూడా తీసుకుపోతానని వర్మ చెబుతున్నారు.

అయితే నెటిజన్లు వర్మ బాగానే సంపాదించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.ఆస్తుల గురించి తాను పట్టించుకోనను చెప్పిన వర్మ తన కూతురు గురించి చెప్పుకొచ్చారు.తాను బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనని ఆర్జీవీ తెలిపారు.తన కూతురు తనకు స్నేహితురాలిలా ఉంటుందని కూతురుకు పుట్టిన పాప పేరు కూడా తనకు తెలియదని వర్మ వెల్లడించారు.

ఆర్జీవీ కూతురు పేరు రేవతీవర్మ కాగా ఆమె ఒక డాక్టర్ ను వివాహం చేసుకున్నారు.మరోవైపు వరుస సినిమాలతో ఆర్జీవీ బిజీగా ఉన్నారు.ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలను ఎక్కువగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.అయితే ఓటీటీలలో రిలీజవుతున్న వర్మ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

వర్మ లో బడ్జెట్ తో తెరకెక్కిసున్న సినిమాలు ఆ బడ్జెట్ స్థాయిలో కలెక్షన్లను సాధించలేక ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube