ఎంతో కష్టపడి సినిమా పరిశ్రమకి వచ్చి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుని బాగానే రాణిస్తున్న సమయంలో అనుకోకుండా తీసుకున్న నిర్ణయాలు మరియు చేసినటువంటి తప్పుల కారణంగా సినిమా కెరియర్ ని ఇబ్బందుల్లోకి నెట్టుకున్నటువంటి నటీనటులు చాలామందే సినిమా పరిశ్రమలో ఉన్నారు.అయితే తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన “జాదూగాడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ మరియు మోడల్ “సోనారిక బండారియా” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఘాటు అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు కట్టిపడేస్తుంది.దీంతో ఈ అమ్మడుకి ఈ రోజు రోజుకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెరిగుతోంది.
అయితే సోనారిక తెలుగులో “జాదూగాడు” చిత్రంలో నటించిన తర్వాత మంచు విష్ణు మరియు రాజ్ తరుణ్ తదితరులు నటించిన మల్టీ స్టారర్ చిత్రం “ఈడోరకం ఆడోరకం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.ఈ చిత్రం పర్వాలేదని పెంచడంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో సినిమా ఆఫర్లు బాగానే తలుపు తడతాయి.
దీంతో కథ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఓ బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది.
దీంతో ఒక చిత్రానికే ఈ అమ్మడి సినిమా కెరియర్ పూర్తిగా బోల్తా పడింది.అయితే ఆ బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సమయంలో పలు తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ సోనారిక అనివార్య కారణాల వల్ల వాటిని రెజెక్ట్ చేసిందట.
దాంతో ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా సినిమా ఆఫర్లు ఏమీ లేవు.దీనికి తోడు ఆ మధ్య తమిళంలో “ఇంద్రజిత్తు” అనే చిత్రంలో నటించింది.
కానీ ఈ చిత్రం కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడి ఆశలు అడియాశలు అయ్యాయి.
అయితే సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు సోనారిక “హరహర మహాదేవ్” అనే ధారావాహికలో “పార్వతి” పాత్రలో నటించి బాగానే బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.
ఈ క్రమంలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నప్పటికీ కథల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో హీరోయిన్ గా ఈ అమ్మడి కెరియర్ పెద్దగా రాణించలేక పోతోంది.దీంతో మళ్లీ సీరియళ్లలో నటించే అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.