అమ్మ ఓ అద్భుతమైన కావ్యం.ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మొహం పై చెరగని చిరునవ్వు దరహాసంతో తన పిల్లలను కొంగు చాటున కాపాడుకుంటూ, తాను కష్టాలకి కృంగి కృశించిపోతున్నప్పటికీ తన పిల్లలకు నీడనిచ్చే చెట్టు అమ్మ.
అలాంటి అమ్మకి ఎన్ని వేలసార్లు వందనాలు తెలిపినా తక్కువే.అయితే తాజాగా మాతృ దినోత్సవ ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు తమ తల్లులకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
మరికొందరైతే చిన్నప్పుడు తమ తల్లితో కలిసి తీసుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు.
అయితే టాలీవుడ్ ప్రముఖ విలన్ సోనూసూద్ తన సోషల్ మీడియా మాధ్యమాలలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో ఇటీవలే మాతృ దినోత్సవ సందర్భంగా చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగినటువంటి ఫోటోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.అంతేకాకుండా తన తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు.
అలాగే ఈ ఫోటోకి అమ్మ “ఐ లవ్ యూ” అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ ప్రపంచం మొత్తం కరోనా విపత్కర సమయంలో కష్టాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే నేనున్నానని తన వంతు సహాయం అందిస్తున్న సోనూసూద్ ని చూసి గర్వపడుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలనే మంచి గుణాన్ని సోనూసూద్ కి నేర్పించిన అతడి తల్లి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో “ఆచార్య” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పూజా హెగ్డే తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఇస్తుండగా రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.