దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకీ ఉగ్ర రూపం దాల్చుతోంది.ఈ క్రమంలో ఇప్పటికే రోజూ కనీసం రెండు లక్షల పైచిలుకు కరోనా వైరస్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి.
దీంతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ మహమ్మారి అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నియంత్రణలోకి మాత్రం రావడం లేదు.దీనికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే తాజాగా ఈ కరోనా వైరస్ బారినపడి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “సాయి బాలాజీ” కన్నుమూశారు.ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం స్పష్టం చేశారు.
అయితే గత కొద్ది రోజులుగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సాయి బాలాజీ ఈ రోజు ఉదయం ఈ సమస్య మరింత ఎక్కువ కావడంతో హఠాత్తుగా మరణించారు.దీంతో కొందరు సినీ సెలబ్రిటీలు సాయి బాలాజీ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
అయితే గతంలో సాయి బాలాజీ దాదాపుగా పదికి పైగా చిత్రాలలో అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశాడు.అంతేగాక శ్రీరామ్, శివాజీ, తదితర చిత్రాలకు దర్శకుడిగా కూడా పని చేసాడు.
కానీ సరైన హిట్ రాకపోవడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నిన్నటి రోజున తెలుగు ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య కూడా ఈ కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు.అయితే ఒక రోజు గ్యాప్ లోనే సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.దీంతో కొందరు సెలబ్రిటీలు కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతుందని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.
అంతే కాకుండా నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కుంటూ, అలాగే బయటకి వచ్చే సమయంలోమాస్కులను తప్పక ధరించాలని కూడా సూచిస్తున్నారు.