చంద్రబాబు అంటే పని రాక్షసుడిగా పేరు ఉంది.ఏదైనా పని ఉంది అంటే ఆయన నిద్రపోడు, ఎవరినీ నిద్రపోనివ్వడు అన్నట్లుగా ఏదైనా పని పట్టుకుంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు.
ఆ స్థాయిలో బాబు పని చేస్తూ ఉండబట్టే టిడిపి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడగలిగింది.కానీ 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి బాబుకు పెద్దగా కాలం కలిసి రావడం లేదు.
పార్టీ ఘోర పరాజయం తో పాటు, సొంత పార్టీ నాయకులు తనను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని, పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా పోయిందని, ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వచ్చింది.కానీ ఎవరిపైనా, ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు.
ఎందుకంటే అలా చర్యలు తీసుకోవడం అంటూ మొదలు పెడితే, పార్టీలో ఎవరూ మిగలర అనేది ఆయనకు బాగా తెలుసు.ఇటీవల అచ్చెన్నాయుడు ఉదాంతం బయటపడినా, సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనట.
ఇక జగన్ రాజకీయ వ్యూహాలు ముందు తను ఎత్తుగడలు ఏవి పనిచేయకపోవడం, రెండేళ్ల వైసీపీ పాలన పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, మళ్ళీ టీడీపీకి భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందని బాబు నమ్ముతూ వస్తున్నారు.
కానీ ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలు మొత్తం వైసిపికి అనుకూలంగా ఉండడంతో , ఇక ముందు ముందు కష్టాలు ఎదుర్కోవాల్సిందే అని డిసైడ్ అయిపోయారు.
మరో మూడేళ్ల పాటు పోరాటాలు చేస్తూనే ఉండాలని , అప్పటికి పార్టీ ఏ స్థితిలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి అని బాబు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారట.
70 ఏళ్ళ వయస్సు దాటినా, మెంటల్ టెన్షన్ భరిస్తూ, నిత్యం ఇబ్బంది పడుతున్నానని, ఇక ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగితే , తనకు అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి అనే ఆందోళన లో చినబాబు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. దీంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకునే నిమిత్తం త్వరలోనే అమెరికాకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట.
ఈ విధంగా అయినా కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకుని మళ్ళీ యాక్టివ్ అవ్వాలని, కొంతకాలం ఈ విధంగా విశ్రాంతిలో ఉంటే, లోకేష్ కూడా సెట్ అవుతాడని, ఎవరు ఏంటి అనే విషయం బాగా గ్రహించగలుగుతారు అని , ఆ తర్వాత తాను యాక్టివ్ గా ఉన్నా, లేకపోయినా లోకేష్ కు నాయకత్వ లక్షణాలు పూర్తిస్థాయిలో వస్తాయని, తాను పై పైన మానిటరింగ్ చేస్తే సరిపోతుందనే అభిప్రాయం లో బాబు ఉన్నారట. అది త్వరలోనే బాబు అమెరికా పర్యటన ఉండే అవకాశం ఉండటంతో కొంత కాలం ఏపీ రాజకీయాలు బాబు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.