దేశంలోనే అతిపెద్ద మైనింగ్ స్కాం.సుమారు 8 వేలకోట్ల రూపాయల విలువచేసే క్వాడ్జిస్టోన్ దోపిడి.
అక్రమ మైనింగ్ పై సత్యాగ్రహ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandramohan Reddy ) పట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసులు.అర్ధరాత్రి అక్రమ అరెస్టుపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
దేశంలోని అతి పెద్ద మైనింగ్ స్కాం( Mining scam ) పొదలకూరులో జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy ) పేర్నిటి శ్యాం ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 8 వేల కోట్ల రూపాయల క్వాడ్జ్ స్టోన్ అక్రమంగా తరలించారని సోమిరెడ్డి తెలియజేశారు.సత్యాగ్రహ దీక్ష చేస్తున్న తనపై వైసీపీ నాయకులు హిజ్రాలను పంపిస్తే వారు ఆశీర్వదించి వెళ్లారన్నారు.
అన్ని రాజకీయ పార్టీలను ప్రజా క్షేమం కోరే అన్ని వర్గాలను కలుపుకొని అక్రమ మైనింగ్ పై పోరాటం కొనసాగిస్తామన్నారు.