తెలుగులో 2010 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించిన “ఆరెంజ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించగా హీరోయిన్ గా జెనీలియా నటించింది.
కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించగా ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ సంగీతం సమకూర్చాడు.అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది.
దీంతో ఈ చిత్ర నిర్మాత నాగబాబు కి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.దాంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన పారితోషకాన్ని పూర్తిగా నాగబాబు కి తిరిగి ఇచ్చేశాడు.
కాగా ఇటీవలే ఈ విషయంపై ఈ చిత్ర నిర్మాత నాగబాబు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇందులో భాగంగా ఆరెంజ్ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో తనకు చాలా నష్టం వచ్చిందని, దాంతో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తన సగం అప్పులు తీర్చేశాడని అంతేకాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన పారితోషకాన్ని తిరిగి ఇచ్చేశాడని తెలిపాడు.
దాంతో భవిష్యత్తులో మళ్ళీ రామ్ చరణ్ తేజ్ కి తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేస్తానని కూడా తెలిపాడు.అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టెవ్ గా ఉండే నాగబాబుకి ఈ మధ్య కాలంలో లైవ్ కార్యక్రమాలు, చిట్ చాట్ కిఆర్యక్రమాలు నిర్వహిస్తూ బాగానే తన అభిమానులకి అందు బాటులో ఉంటున్నాడు.
అయితే ఈ విషయంలో ఇలా ఉండగా ఇటీవలే ఓ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ అయిన జీ తెలుగులో ప్రసారమయ్యే “అదిరింది షో” లో నాగబాబు జడ్జీ గా వ్యవహరించేవాడ.కానీ ఉన్నట్టుండి ఈ షో ఆగిపోవడంతో ప్రస్తుతం ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతున్నాడు.
దీంతో అప్పుడప్పుడు యూట్యూబ్ లో మోటివేషనల్ వీడియోస్ చేస్తూ బాగానేఅలరిస్తున్నాడు.