కొడుకు ను చూడాలని ఎంతో తపించిన ఓ తండ్రి తెలంగాణ నుంచీ అమెరికా తన భార్యతో కలిసి వెళ్లి సరదాగా కొడుకు ఫ్యామిలీ తో గడుపుతున్న సమయంలో ఊహించని ప్రమాదం ఆ కుటుంభంలో తీవ్ర విషాధం నింపింది.తన భార్యా,కొడుకు ముందే అగ్నికి ఆహుతవుతున్న అతడి ఆర్తనాదాలు ప్రతీ ఒక్కరిని కదిలించాయి.
తండ్రిని కోల్పుతున్న కొడుకు, అప్పటి వరకూ తనతో ఉన్న భర్త కళ్ళ ముందే కాలిపోతుంటే ఏమి చేయలేక చూస్తూ కూలబడిన తల్లి.ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో వరంగల్ లోని హన్మకొండ లో విషాదచాయలు అలుముకున్నాయి.
వివరాలలోకి వెళ్తే.
వరంగల్ జిల్లా హన్మకొండ గోపాలపూర్ కు చెందిన రాజమౌళి స్థానికంగా ఉన్న సాంఘీక సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు.
ఆయన చిన్న కుమారుడు పవన్ అమెరికాలోని మిచిగాన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నారు.సెలవు పెట్టి రాజమౌళి ఆయన సతీమణి నీలిమ తో చిన్న కొడుకు వద్దకు వెళ్ళారు.
న్యూయార్క్, వాషింగ్టన్ లోని సందర్సన ప్రాంతాలను కొడుకుతో కలిసి చూసిన రాజమౌళి దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలోనే ఇల్లు ఇంకా రెండు మైళ్ళ దూరం ఉందనగా ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో వర్షానికి కారు అదుపు తప్పి డివైడర్ ను డీ కొట్టింది.
ఈ సంఘటనతో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో అందరూ బాగానే ఉన్నారనుకున్నారు.కారుకు ఏమన్నా అయ్యిందా అని పరిశీలించడానికి పవన్ ఆయన స్నేహితుడు కిందకు దిగారు.
ఈ క్రమంలోనే ఒక్క సారిగా కారులోంచి మంటలు పెద్ద ఎత్తున రేగడంతో కారులో ఉన్న తల్లి తండ్రులను కాపాడుకునే ప్రయత్నం చేశారు పవన్.అయితే పవన్ తల్లి నీలిమ ప్రాణాలతో బయట పడగా, తండ్రి రాజమౌళి మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.
ఈ ఘటన తెలుసుకున్న రాజమౌళి భంధువులు,సన్నిహితులు, సహా ఉద్యోగులు కన్నీరు మున్నీరవుతున్నారు.