మీ వల్ల యూఏఈ శక్తివంతం: భారతీయ వ్యాపారవేత్తకు అబుదాబీ అత్యున్నత పురస్కారం

భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూసఫ్‌లీ ఎంఏని అబుదాబీ.దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది.

 Indian Business Tycoon Yusuffali Honoured With Top Civilian Award In Abu Dhabi,-TeluguStop.com

వ్యాపారంతో పాటు సామాజిక విభాగాల్లో ఆయన దేశానికి అందించిన సేవడిప్యూటీ సుప్రీం కమాండర్ లకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అబుదాబీ ప్రభుత్వం తెలిపింది.దేశ యువరాజు, యూఏఈ సాయుధ దళాల షేక్‌ మహమద్‌ బీన్‌ జాయెద్‌ ఆల్‌ నహ్యాన్‌ చేతుల మీదుగా యూసుఫ్‌అలీ శుక్రవారం ఈ అవార్డును అందుకున్నారు.

ఆయనతో పాటు మరో 11 మంది కూడా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు.

కేరళలో జన్మించిన అలీ.అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ఈ గ్రూప్ వివిధ దేశాల్లో హైపర్‌మార్కెట్లు నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ షేక్‌ మహమద్‌ బీన్‌ జాయెద్‌ మాట్లాడుతూ.యూఏఈని శక్తివంతం చేస్తున్న 12 మంది గొప్ప వ్యక్తులను ఈరోజు సత్కరించుకున్నామని అన్నారు.

అనంతరం అలీ మాట్లాడుతూ.ఇది తన జీవితంలో గర్వపడే క్షణమని చెప్పారు.గత 47 సంవత్సరాలుగా తాను నివసిస్తున్న అబుదాబీ నుంచి ఇంత గొప్ప గౌరవం పొందడం ఆనందంగా వుందని యూసఫ్ అలీ పేర్కొన్నారు.1973, డిసెంబర్ 31న ఎన్నో కలలు, ఆశలతో తాను యూఏఈకి వచ్చానని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ పురస్కారాన్ని అబుదాబీలోని భారతీయ సమాజానికి అంకితం చేస్తున్నట్లు యూసుఫ్‌అలీ చెప్పారు.కాగా, అబుదాబీ అత్యున్నత పురస్కారానికి ఎంపికైన 12 మందిలో అలీ ఒక్కరే భారతీయుడు కావడం విశేషం.

Telugu Abu Dhabi Award, Chairman Lulu, Sheikhmohammed, Usufali-Telugu NRI

మధ్యప్రాచ్యంలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా 2021లో యూసుఫ్‌అలీ స్థానం సంపాదించారు.ఇదే సమయంలో గల్ఫ్‌లోని అన్ని దేశాల అధినేతలతో సన్నిహిత సంబంధం వుండటంతో మధ్యప్రాచ్యంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.వ్యాపారంలో రాణిస్తూనే.సమాజానికి ఎంతో కొంత చేయాలని ఆయన భావించారు.దీనిలో భాగంగాగానే కోవిడ్ 19 విపత్కర కాలంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు, కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్లు, యూపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు, హర్యానా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం అందించారు.అలాగే మధ్యప్రాచ్యంలో భారతీయుల తరపున పనిచేస్తున్న సామాజిక, సాంస్కృతిక సంస్థలకు కోటి రూపాయలు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube