ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో మళ్లీ సినీ పరిశ్రమ లపై ప్రభావం చూపుతుంది.ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు కరోనా బారిన పడగా కొన్ని సినిమా షూటింగ్లు మధ్యలో ఆగిపోయాయి.
ఇక చిరంజీవి నటించనున్న సినిమా కూడా మరో రెండు నెలలు పోస్ట్ పోన్ కానుందట.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ సినిమాను మరో రెండు నెలలు పోస్ట్ పోన్ చేయనున్నట్లు సినీ దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్లు తెలిసింది.

ఇక ఆచార్య సినిమా మే 13న విడుదల చేయడానికి సినీ బృందం ప్రకటించగా ఈ సినిమా కూడా విడుదలకు కాస్త సమయం పడుతుందని తెలిపారు.ఇక లూసిఫర్ సినిమా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేయగా ఈ సినిమా మార్చి రెండో వారం నుండి షూటింగ్ ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో సినిమా లో నటించే నటీనటులను ముందుగానే ఎంపిక చేశారు.ఇక ఆ సమయంలో ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వగా మళ్లీ ఇప్పుడు కరోనా నేపథ్యంతో పోస్ట్ పోన్ కానుంది.ఇక ఈ సిని డైరెక్టర్ ప్రస్తుతం కొన్ని రిఫరెన్స్ పనిలో బిజీగా ఉన్నాడట.
ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి తమిళంలో మంచి విజయం సాధించిన వేదళమ్ సినిమా రీమేక్ లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.