మనలో చాలామంది ఎటువంటి సందేహం వచ్చినా ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు గూగుల్ లేదా వికీపీడియా ఆశ్రయిస్తూ ఉంటారు.అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ కూడా తప్పు సమాచారం ఇస్తుంది.
నిన్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న అఖిల్ ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటివరకు అఖిల్ మూడు సినిమాల్లో నటించగా ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి.బాలనటుడిగా ఆరు నెలల వయస్సుల్లోనే సిసింద్రీ సినిమాలో నటించి మెప్పించిన అఖిల్ అమెరికన్ యాక్టర్ అని వికీపీడియా పేర్కొంది.
అఖిల్ అమెరికాలోనే పుట్టినా హైదరాబాద్ లోనే పెరిగారు.అయితే వికీపీడియా మాత్రం అఖిల్ అమెరికన్ అని తప్పుగా సమాచారం ఇవ్వడం గమనార్హం.గతంలో కూడా గూగుల్ కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించి ఇదే విధంగా తప్పు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.
అఖిల్ గురించి తప్పుగా సమాచారం ఇస్తున్న వికీపీడియా ఆ తప్పును సరిదిద్దుకుంటుందేమో చూడాల్సి ఉంది.కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు.గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా జూన్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో మాత్రం అఖిల్ సీక్రెట్ ఏజెంట్ రోల్ లో నటిస్తున్నారు.అఖిల్ హీరోగా నటించిన తొలి సినిమా అఖిల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అఖిల్ మాస్ సినిమాలకు దూరంగా ఉన్నారు.నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ లో అఖిల్ రఫ్ లుక్ లో సిగరెట్ పట్టుకుని కనిపించారు.