జర్నలిజం ఎన్నో సవాళ్ళతో కూడుకున్న వృత్తి అనే విషయం మనకు తెలిసిందే.అయితే క్షేత్ర స్థాయిలో సమస్యలను కూలంకశంగా ప్రజలకు వివరించే క్రమంలో ఎన్నో సవాళ్ళు, చిత్ర విచిత్ర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.
లాక్ డౌన్ సమయంలో కొంత మంది న్యూస్ యాంకర్స్ కూడా చిత్ర విచిత్ర పరిస్థితులు ఎదుర్కొన్న వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారి నెటిజన్లకు నవ్వులు విరసాయి.ఎందుకంటే రిపోర్టింగ్ జనావాసాల మధ్య చేయాల్సి వస్తుండడంతో కొన్ని కొన్ని రకాల సంఘటనలు జరగడం సర్వ సాధారణం.
ఇక అసలు విషయంలోకి వస్తే రష్యా లోని మీర్ టీవీ రిపోర్టర్ వాతావరణ విశేషాలు చెబుతున్న సమయంలో ఓ కుక్క అకస్మాత్తుగా రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ ను బహుశః ఏదో తినే వస్తువు అనుకుందో ఏమో చటుక్కున లాక్కొని వెళ్ళిపోయింది.అయితే ఇక రిపోర్టర్ కుక్క వెంబడి పరుగెత్తుతూ మొత్తానికి తన మైక్ ను సంపాదించుకుంది.
అయితే ఈ తతంగమంతా సదరు టీవీ ఛానల్ కెమెరాలో రికార్డయ్యాయి.ఇక ఈ వీడీయో ఇప్పుడూ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్ లకు నవ్వులు విరిసాయి.మీకూ ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.