మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున సెట్ లో వేడుకలు నిర్వహించారు.చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం పెద్ద ఎత్తున చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఈ నేపథ్యంలో చరణ్ పుట్టిన రోజు సందర్బంగా హెచ్ డి బి రామ్ చరణ్ అంటూ భారీ అక్షరాలను భారీ క్రేన్ తో లిఫ్ట్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున క్రాకర్స్ ను కాల్చడం జరిగింది.చిత్ర యూనిట్ సభ్యులు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా జరిపిన వేడుక కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు తుది దశ చిత్రీకరణ లో పాల్గొంటున్నారు.చరణ్ బర్త్ డే కు జరిపిన విధంగా ఎన్టీఆర్ బర్త్ డే కు సెట్స్ లో వేడుక నిర్వహించే అవకాశం లేదు.
ఎందుకంటే అప్పటికే సినిమా షూటింగ్ ముగుస్తుంది.
ఎన్టీఆర్ ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే వేడుక ఆర్ ఆర్ ఆర్ సెట్ లో వైభవంగా చేశారు.మరి ఎన్టీఆర్ బర్త్ డేకు అలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా అంటున్నారు.
కాని అప్పటి వరకు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో తో బిజీ అవ్వడంతో పాటు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను మొదలు పెడతాడు.అందుకే ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేయడం మినహా అంతకు మించి ఎలాంటి ప్రత్యేక వేడుకలు ఉండక పోవచ్చు అంటున్నారు.
ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో అద్బుతమైన విజువల్స్ ను దర్శకుడు జక్కన్న చూపించబోతున్నాడు.