ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని అధిక బరువు సమస్య తీవ్రంగా వేధిస్తోంది.మారిన జీవనశైళి, ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, థైరాయిడ్, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, మద్యం అలవాటు ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరుగుతూ ఉంటాయి.
అయితే పెరిగిన బరువును, ఒంట్లో కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు.కొందరైతే బరువు తగ్గేందుకు పూర్తి తినడం కూడా మానేస్తారు.
కానీ, ఇలా చేయడం చాలా పొరపాటు.వాస్తవానికి కొన్ని కొన్ని ఆహారాలను తింటేనే బరువును సలభంగా తగ్గించుకోవచ్చు.అలాంటి ఆహారాల్లో రొయ్యలు ఒకటి.మన భారతీయులు రొయ్యలతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తుంటారు.
ఎలా చేసినా రొయ్యల రుచి అద్భుతంగా ఉంటుంది.అయితే రుచిలో కాదు.
రొయ్యల్లో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి.
ముఖ్యంగా బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారికి రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి.
రొయ్యల్లో ప్రోటీన్లు ఎక్కువగా.కేలరీలు తక్కువగా ఉంటాయి.
రొయ్యల్లో పుష్కలంగా ఉండే జింక్ శరీరంలో లెప్టిన్ అనే హార్మోన్ ప్రవాహాన్ని పెంచుతుంది.సాధారణంగా మన శరీరంలో లెప్టిన్ సరిగా ఉత్పత్తి కాకపోతే బరువు పెరుగుతారు.
అయితే రొయ్యలను డైట్లో చేర్చుకోవడం వల్ల లెప్టిన్ ఉత్పత్తి పెరుగుతుంది.దాంతో బరువు తగ్గుతారు.

అలాగే రొయ్యల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అత్యధికంగా ఉంటాయి.ఇవి శరీరంలో వేడిని పెంచి.అదనపు కొవ్వును కరిగేలా చేస్తాయి.పైగా రొయ్యలు తింటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండి భావన కలుగుతుంది.దాంతో వేరే ఆహారాలపై మనసు మల్లకుండా ఉంటుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్లో రొయ్యలను చేర్చుకోవడం బెస్ట్ అటున్నారు నిపుణులు.అయితే రొయ్యలను ఫ్రై చేసి కాకుండా.
ఉడికించి తీసుకోవడం మంచిది.