నాన్న తర్వాత రాజమౌళి ఫ్యామిలీనే.. ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదగడంలో రాజమౌళి పాత్ర కూడా కొంతవరకు ఉంది.

 Junior Ntr Sensational Comments In Tellavarithe Guruvaram Movie Pre Release Eve-TeluguStop.com

రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలను తెరకెక్కించగా ఆ సినిమాలలో నాలుగు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ హీరో కావడం గమనార్హం.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా తెరకెక్కిన తెల్లవారితే గురువారం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.

ఈ నెల 27వ తేదీన తెల్లవారితే గురువారం సినిమా విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి గెస్ట్ లుగా హాజరయ్యారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా ఉంటుందని శ్రీ సింహాను చూసి తాను కూడా అలానే ఫీల్ అవుతున్నానని అన్నారు.

Telugu Ntr, Pre, Sensational-Movie

తాను ఏ విషయంలో నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం విషయంలో రాజమౌళి ఫ్యామిలీ ప్రమేయం కచ్చితంగా ఉంటుందని తనకు తండ్రి హరికృష్ణ తరువాత రాజమౌళి కుటుంబమే అంటూ జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చేశారు.తెల్లవారితే గురువారం సినిమా భారీ హిట్ కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.ఈ సినిమాకు గాలి మణికాంత్ డైరెక్టర్ గా వ్యవహరించగా చిత్రాశుక్లా, మిషా హీరోయిన్లుగా నటించారు.

నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.యూత్ కు నచ్చేలా ఉన్న ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఎన్టీఆర్, రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube