ఐటెమ్ నెంబర్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అప్సర రాణి

టాలీవుడ్ ఐటెం సాంగ్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది జయమాలిని, జ్యోతిలక్ష్మి, డిస్కో శాంతి, సిల్క్ స్మిత.వీళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ ద్వారానే తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.

 Actress Apsara Rani Create Buzz With Item Songs, Tollywood, Krack Movie, D-compa-TeluguStop.com

వీళ్ళ తర్వాత కొంతకాలం టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ పెద్దగా లేకుండా పోయాయి.ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల హవా నడవడంతో ప్రత్యేకంగా ఐటెం సాంగ్స్ సినిమాలలో ఉండేవి కావు.

ఉన్నా కూడా అందులో నటించేవారు పెద్దగా ఐడెంటిటీ ఉండేవారు కాదు.అయితే తరువాత ముమైత్ ఖాన్ రూపంలో టాలీవుడ్ లో పోకిరి సినిమాతో ఒక్కసారిగా అడుగుపెట్టింది.

ఈ భామ వరుసగా ఐటెం సాంగ్స్ లో అవకాశాలు సొంతం చేసుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.అయితే తరువాత ఐటెం సాంగ్స్ కోసం హీరోయిన్స్ కూడా రెడీ అయిపోవడంతో ముమైత్ ఖాన్ ఇమేజ్ తగ్గిపోయింది.

భారీగా రెమ్యునరేషన్ తీసుకొని కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేయడం మొదలు పెట్టారు.అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మలు ప్రత్యేక పాటలలో కనిపించడానికి రెడీ అయిపోయాడు.

దీంతో కొంతకాలం హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ ట్రెండ్ నడిచింది.అయితే మళ్ళీ ఇప్పుడు అప్సరారాణి రూపంలో మరో ఐటెం పాప టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడటంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.ఆమెని హీరోయిన్ గా పెట్టి ఓ సినిమా చేసి ఒటీటీలో రిలీజ్ చేసేశాడు.

తరువాత క్రాక్ సినిమాలో మొదటి ఐటెం సాంగ్ చేసింది.ఆర్జీవీ డి-కంపెనీ ఐటెం సాంగ్ చేసింది.

ఇప్పుడు సిటీమార్ లో పెప్సీ అంటీ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సాంగ్ ని తాజాగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

సోషల్ మీడియాలో ఈ సాంగ్ ప్రస్తుతం దూసుకుపోతుంది.ఈ సాంగ్ లో అమ్మడు అందాల విందు వడ్డించింది.

ప్రస్తుతం అప్సరారాణి స్పీడ్ చూస్తూ ఉంటే మరికొంత కాలం ఆమె తన హవా కొనసాగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube