టాలీవుడ్ సినీ నటుడు శర్వానంద్ గురించి అందరికీ తెలిసిందే.తను నటించే సినిమాలలో తన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
అంతే కాకుండా తమిళంలో కూడా నటించి మంచి విజయాన్ని సాధించుకున్నాడు.మొదట్లో కొన్ని సినిమాలలో కీలక పాత్రల్లో నటించిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
శర్వానంద్ సమంత తో కలిసి నటించిన జాను సినిమా తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం శర్వానంద్ కిషోర్.
బి దర్శకత్వంలో తెరకెక్కనున్న శ్రీకారం సినిమాలో నటిస్తున్నాడు.అంతేకాకుండా మరో సినిమా అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ బయటకు రాగానే ప్రస్తుతం ఈ స్టోరీ గురించి సోషల్ మీడియాలో వార్త హల్ చల్ గా మారింది.చిన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు స్నేహం గా ఉండగా కొన్ని కారణాల వల్ల ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటూ పోతారు.ఇక అది కాస్త పెద్ద వాళ్ళు అయ్యే వరకు మరింతగా పెరుగుతుంది.దీంతో ఇద్దరు హీరోలకు ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయడానికి సినీ బృందం ఏర్పాటు చేస్తున్నారట.
ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి విజయాన్ని సాధించిన అజయ్ భూపతి దర్శకత్వం ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధిస్తారని తెలుస్తుంది.ఇక శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా త్వరలోనే విడుదల కానుంది.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఒక పాటను కూడా విడుదల చేశారు.