తెలుగు సినిమా పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న “ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్” గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రభాస్ తన అభిమానులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు.
అందుకే అతడిని డార్లింగ్ అంటూ కొంతమంది సంబోధిస్తుంటారు. కాగా ప్రభాస్ సినిమా పరిశ్రమలో స్నేహితులకు కూడా చాలా విలువ ఇస్తాడు.
ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది హీరోల చిత్రాల ప్రమోషన్ ఈవెంట్లకి కూడా హాజరవుతున్నాడు.అంతేకాక ఆ మధ్య ఓ చిత్ర ప్రమోషన్లో భాగంగా పాల్గొని సినిమా పరిశ్రమలో కొత్త నటీనటులను ప్రోత్సహించడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని అంతేగాక ఎలాంటి సహాయం అవసరమైన చేస్తానని కూడా తెలిపాడు.
అయితే తొలివలపు చిత్రంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన ప్రముఖ దర్శకుడి కొడుకు టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కి మరియు ప్రభాస్ కి మధ్య ఉన్న స్నేహం మరియు సాన్నిహిత్యం గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ మధ్య ప్రభాస్ గోపీచంద్ కొడుకు పుట్టినరోజు వేడుకలకు కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే తాజాగా గోపీచంద్ కి ప్రభాస్ టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ పై నిర్మిస్తున్న ఓ చిత్రంలో హీరోగా రెకమెండ్ చేశాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అంతేగాక ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందుకోసం ప్రభాస్ గోపీచంద్ కి పలు సలహాలు, సూచనలు కూడా ఇచ్చినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.
తొందర్లోనే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ తెలుగులో “రాధేశ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయింది.అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓమ్ రావత్ దర్శకత్వం వహిస్తున్న “ఆదిపురుష్” అనే చిత్రంలో కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక గోపీచంద్ విషయానికొస్తే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న “సీటీమార్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండడంతో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు.
ఇటీవలే ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్న “పక్కా కమర్షియల్” అనే ఈ చిత్రంలో కూడా హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.