రోజుకో క‌ప్పు వెల్లుల్లి నీరు తాగితే.. ఆ జ‌బ్బులు దూరం!

పోష‌కాలు మెండుగా ఉండే వెల్లుల్లి ఆరోగ్య ప‌రంగా చేసే మేలు అంతా ఇంతా కాదు.

అయితే ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండ‌టం వ‌ల్ల చాలా మంది వెల్లుల్లిని దూరం పెడుతుంటారు.

ఫ‌లితంగా, బోలెడ‌న్నీ హెల్త్ బెనిఫిట్స్‌ను కోల్పోతున్నారు.అయితే వెల్లుల్లిని డైరెక్ట్‌గా తిన‌లేని వారు వెల్లుల్లి నీరు తాగ‌డం చాలా మందిచి.

వెల్లుల్లి నీరుతోనూ అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.పైగా ఈ వెల్లుల్లి నీరు కూడా పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కూడా కాదు.

కేవ‌లం మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను క్ర‌ష్ చేసి వాట‌ర్‌లో వేసి మ‌రిగించుకోవాలి.

Advertisement

ఇలా మ‌రిగిన నీటితో వ‌డ‌గ‌ట్టుకుని తేనె క‌లిపి గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత తీసుకోవాలి.ఈ వెల్లుల్లి నీరు రోజుకో క‌ప్పు చ‌ప్పున ప్ర‌తి రోజు తీసుకుంటే ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.ముఖ్యంగా జ్ఞాప‌క శ‌క్తి లోపిస్తుంద‌ని భావించే వారు ఈ వెల్లుల్లి నీరు తాగితే మెద‌డు ప‌ని తీరు మెరుగు పడుతుంది.

ఫ‌లితంగా, జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది.అలాగే డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులు కూడా ఈ వెల్లుల్లి నీరు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

రెగ్యుల‌ర్ డైట్‌లో ఒక క‌ప్పు వెల్లుల్లి నీరు చేర్చుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

చ‌ర్మానికి కూడా వెల్లుల్లి నీరు ఎంతో మేలు చేస్తుంది.ఈ వెల్లిల్లి నీరులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.అలాగే కీళ్ల నొప్పులు ఉన్న వారు రెగ్యుల‌ర్‌గా వెల్లుల్లి నీరు తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఫ‌లితంగా కీళ్ల నొప్పులు, వాపులు దూరం అవుతాయి.అంతేకాదు, ప్ర‌తి రోజు వెల్లుల్లి నీరు ఉద‌యం పూట తీసుకోవ‌డం వ‌ల్ల‌ నోట్లో ఉండే బ్యాక్టీరియా నాశ‌నం అవుతుంది.

Advertisement

మ‌రియు నోటి దుర్వాస‌న స‌మ‌స్య కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని అతిగా మాత్రం వెల్లుల్లి నీరు తీసుకోరాదు.రోజుకి కేవ‌లం ఒక క‌ప్పు మాత్ర‌మే తీసుకోవాలి.

తాజా వార్తలు