అమెరికాలో ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నత స్థానాలలో ఉంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని పుట్టిన ఊరు దేశానికి ఎంతో మంచి పేరు తెస్తుంటే కొందరు మాత్రం వారి వారి ప్రవర్తనల కారణంగా తెలుగువారి పరువు పోగొడుతున్నారు.తాజాగా ఓ మహిళను రైలు కిందకు తోసి చంపబోయిన ఘటన న్యూయార్క్ లో సంచలనం సృష్టించింది.
దాంతో స్థానిక న్యూయార్క్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ చర్యలకు పాల్పడింది ఓ తెలుగు యువకుడిగా గుర్తించారు…వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల యూనియన్ స్క్వేర్ సబ్వే స్టేషన్ లో ఓ అమెరికన్ మహిళ తన గమ్యస్థానానికి వెళ్ళడానికి కూర్చొని ఉంది.రైలు వస్తున్నట్టుగా చూసిన ఆమె రైలు కోసం నుంచొని ఉండగా ఆమెకు పక్కనే ఉన్న తెలుగు యువకుడు ఆదిత్య ఒక్క సారిగా ఆమెను రైలు కిందకి తోసేశాడు.
ఒక్క సారిగా ఈ ఘటనతో షాక్ అయిన సదరు మహిళ వెంటనే కోలుకుని రైలు వచ్చేలోగానే తప్పించుకుంది.అయితే అదే సమయంలో బలమైన గాయాలతో అక్కడే ఇరుక్కుపోయింది.
ఈ పరిస్థితిని గమనించిన రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆమెను రక్షించారు.వెంటనే స్థానిక పోలీసులకు తెలుపగా ఆదిత్యను న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటన స్థలంలో ఉన్న సిసి కెమరాలను పోలీసులు పరిశీలించారు.కావాలనే ఆ యువకుడు ఆమెను రైలు కిందకు తోసేశాడని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
అయితే అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించిన పోలీసులు కోర్టులో హాజరుపరుచాగా డిసెంబర్ 4 వరకూ రిమాండ్ విధించింది…