ఎక్కడో హైదరాబాదులో ఉండి తమపై విమర్శలు చేయడం కాదని, ఏపీకి వచ్చి ఇక్కడి నుంచి విమర్శిస్తే పద్ధతిగా ఉంటుంది అంటూ వైసీపీ నాయకులు పదేపదే టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేస్తూ వచ్చేవారు.టిడిపి నాయకులు సైతం ఇదే వైఖరితో ఉండేవారు.
పార్టీ తరఫున కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండాలని, ప్రభుత్వం పై పోరాటాలు చేయాలని, ఉద్యమాలు నిరసనలు వ్యక్తం చేయాలంటూ చంద్రబాబు పదేపదే హైదరాబాద్ నుంచి జూమ్ యాప్ ద్వారా పార్టీ శ్రేణులను కోరుతూ వచ్చేవారు.అయితే బాబు, లోకేష్ మాత్రం, హైదరాబాద్.
లోనే మకాం వేసి, రోడ్లెక్కి తమను పోరాటం చేయమంటున్నారు అంటూ వారంతా ఆగ్రహం గా ఉంటూ వచ్చేవారు.
బాబు అక్కడి నుంచే జూమ్ ద్వారా పిలుపు ఇచ్చినా స్పందన అంతంత మాత్రంగానే ఉండేది.
నిరంతరం తీరికలేకుండా చంద్రబాబు సైతం హైదరాబాద్ లోని తన నివాసం నుంచే జూమ్ ద్వారా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుండడం, పార్టీ నాయకులతో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించడం, పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జీలను నియమించడం వంటి వ్యవహారాలు అన్నిటినీ హైదరాబాద్ లోని తన ఇంటి నుంచే చక్కబెట్టేవారు.అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో, చంద్రబాబు అమరావతి లో అడుగుపెట్టారు.
అక్కడి నుంచే అమరావతి ఉద్యమాన్ని పరుగులు పెట్టించేందుకే ప్రణాళికలు సిద్ధం చేసి, పార్టీ నేతలను ఉత్సాహపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అయితే చంద్రబాబు మాత్రం ఎక్కడా రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నించడం కానీ, నాయకులు ఎవరినీ నేరుగా కలిసేందుకు ఇష్టపడటం కానీ చేయలేదు.ఏదైనా జూమ్ ద్వారానే అన్నిటిని చక్కబెడుతూ వస్తున్నారు.ఎవరిని కలిసేందుకు ఇష్టపడడం లేదు.దీంతో చంద్రబాబు హైదరాబాదులో ఉంటే ఏమిటి ? అమరావతి లో ఉంటే ఏమిటి ? మాట్లాడేది మొత్తం జూమ్ లోనే కదా అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
నాయకులు ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడకపోవడం, స్వయంగా ఉద్యమాలను ముందు ఉండి నడిపించే విషయంపైన వెనకడుగు వీస్తుండడం, అన్నిటినీ జూమ్ ద్వారానే నిర్వహిస్తుండడం వంటి పరిణామాలతో, బాబు ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా జూమ్ లోనే కదా కనిపిస్తున్నాడని, ఆ మాత్రం దానికి హడావుడిగా అమరావతికి రావడం వల్ల ఉపయోగం ఏముంటుందని స్వయంగా పార్టీ నాయకులే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.