రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా అయినా హిట్ కొట్టాల్సిందే.కొన్ని సినిమాల్లో తను కొత్త కొత్త గ్రాఫిక్స్ లను బాగా చూపిస్తాడు.
ఆయన సినీ జీవితంలో ఓటమి అనేది లేదు.బాహుబలిలో చూపించిన గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరమే లేదు.
అందుకే ఆయన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం.హీరో ఎవరైనా రాజమౌళి దర్శకత్వం అంటే చాలు అభిమానులు సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటారు.
అంతటి అద్భుత దర్శకుడు రాజమౌళి.
ఇక అలాంటి అద్భుత దర్శకుడు తీసిన ‘ఈగ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.
ఆ సినిమా చిత్రీకరణ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.అది ఏంటి అంటే.ఈగలను ఫ్రిడ్జ్ లో పెట్టి మరి చిత్రీకరించారట.ఈ సినిమా షూటింగ్ ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ చిత్రంలో హీరో హీరోయిన్ ల నాని, సమంత నటించగా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమాలో రాజమౌళి తను అనుకున్న బడ్జెట్ లోపే పూర్తి చేయాలని అనుకున్నాడట.
అయితే ఈ సినిమాలో ఈగనే ప్రత్యేకంగా చూపించాలి కానీ సాధ్యం కాదని తెలిసే ఈగను యానిమేషన్ తీయడానికై చాలా బడ్జెట్ ను ఖర్చు చేశారట.అయినా ఆ యానిమేషన్ తో ఎటువంటి లాభం లేకపోయేసరికి ఈ సినిమా సాధ్యంకాదని వదులుకుందాం అని కొందరు చెప్పినప్పటికీ రాజమౌళి ఎంత కష్టం అయినా సరే చెయ్యాలి అని ఏదైతే అది అయ్యింది అని మరింత కష్టపడ్డారు.
ఈసారి నిజంగానే ఈగను చూపించాలని ప్రత్యేకంగా ఈగను తీసుకొని లెన్స్ ద్వారా ఫోటో తీయడానికి ప్రయత్నించారట కానీ అది ఎగిరిపోవడంతో అది కూడా సాధ్యంకాలేదట.దీంతో ఈగలను ఫ్రిడ్జ్ లో పెట్టి అవి తమ స్థితిని మార్చుకున్నాక ఫోటోలు తీశారు.
ఆ ఫోటోలను తన ప్లాన్ ప్రకారం తీసి ప్రాణం ఉన్న ఈగల తెరపై చూపించగా మరో సమస్య వచ్చిందట.ఏంటంటే ఈగ తన భావోద్వేగాలను వ్యక్తికరించాలి.
కానీ అది సాధ్యం కాదు.కాబట్టి రాజమౌళి తన తెలివితో నాని తలపై వస్త్రం కప్పి కేవలం తన బాడీ లాంగ్వేజ్ ను వ్యక్తీకరించాలని కోరగా నాని అలాగే చేశారు.
ఇక ఆ భావోద్వేగాలను తీసి యానిమేషన్ సంస్థతో ఈగనే వ్యక్తీకరించేటట్లు చేయించారట.అలా అంత కష్టపడ్డాడు కాబట్టే ఆ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టింది.
ఏది ఏమైనా రాజమౌళి అంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉంటుంది.కాదంటారా?
.