మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని శరవేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో చిరు సరికొత్తగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.కాగా ఈ సినిమా దేవాదాయశాఖలో జరిగే అన్యాయాలకు సంబంధించిన కథ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ పోస్టర్‌లో చిరు మెడలో ఎర్రకండువా, చేతిలో కత్తి పట్టుకుని ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు.
జనం కోసం కత్తి పట్టిన చిరు మనకు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు.మొత్తానికి కొరటాల శివ ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే కథను పట్టుకొస్తున్నాడని ఈ మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా, ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో కనిపిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాతో చిరు మరోసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.